More

    ఎన్టీఆర్ పై టీడీపీ నేత వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబాన్ని అసెంబ్లీలో కించపర్చినందుకుగాను సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ.. టీడీపీ నేత వర్ల రామయ్య త‌న భార్య‌తో క‌లిసి 12 గంట‌ల‌ దీక్షకు దిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హీరో ఎన్టీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడి భార్య‌ భువనేశ్వరిపై వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్యలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించిన తీరు బాగోలేద‌ని.. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్‌ విఫమయ్యారని వ‌ర్ల రామ‌య్య అన్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ మేనత్తపై వైసీపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేశార‌ని.. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ స‌రిగ్గా స్పందించ‌లేద‌ని వర్ల రామయ్య అన్నారు. సినిమాల కోసం నంద‌మూరి కుటుంబాన్ని, నైతిక విలువలను జూనియ‌ర్ ఎన్టీఆర్ వదులుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. సినిమా కెరీర్‌లో ఉన్న వారికి అమ్మ, అక్క, చెల్లి, మేన‌త్త‌, బావ‌, వ‌దిన‌ అనే వారు అక్క‌ర్లేదా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ 75 ఏళ్ల ముస‌లివాడిలా నీతులు చెబుతున్నార‌ని విమర్శించారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మాట్లాడ‌తాన‌ని ఎన్టీఆర్ గ‌తంలో అన్నాడని, కానీ ఇప్పుడు మేన‌త్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినా మాట్లాడ‌డం లేద‌ని అన్నారు. న‌టుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ గొప్ప‌వాడే అయిన‌ప్ప‌టికీ, మేన‌ల్లుడిగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా విడుద‌ల కానుంద‌ని, అయిన‌ప్ప‌టికీ ఆయ‌న గ‌ట్టిగా మాట్లాడార‌ని అన్నారు. మేన‌త్తపై అటువంటి అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే దీనిపై స్పందించాల‌ని తాము జూనియ‌ర్ ఎన్టీఆర్ ను అడ‌గాలా? అని ఆయ‌న నిల‌దీశారు. హ‌రికృష్ణే క‌నుక ఇప్పుడు ఉండి ఉంటే మ‌రో సీత‌య్య‌లా మారి వైసీపీ నేత‌లపై విరుచుకుప‌డేవార‌ని వ‌ర్ల రామ‌య్య అన్నారు.

    వర్ల రామయ్య వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. అసెంబ్లీలోగానీ, బయటగానీ చంద్రబాబు భార్య పేరును తాము ప్రస్తావించలేదని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారని.. తాను అనని మాటలకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని నాని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనమవుతుందని నాడు చంద్రబాబు చెబితే నమ్మేశారని నాని గుర్తు చేశారు. శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని కొడాలి నాని విమర్శించారు.

    Trending Stories

    Related Stories