వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నట్టు గుర్తించడంతో అక్కడ కొలనును సీల్ చేయాలని కోర్టు ఆదేశించింది. మసీదులో వీడియో సర్వే ఈ రోజుతో ముగియనుండగా.. న్యాయస్థానం ఈ ఆదేశాలను వెలువరించడం గమనార్హం.
సర్వేకు తొలుత అభ్యంతరం తెలపడంతో మరో మూడు రోజుల గడువు పొడిగించింది. మే 17 నాటి విచారణకు సర్వేను పూర్తిచేయాలని, ఇందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గత మూడు రోజుల నుంచి భారీ భద్రత నడుమ సర్వే జరుగుతోంది.
సోమవారం ఉదయం చెరువు నుంచి నీటిని పూర్తిగా తోడేయడంతో శివలింగం బయటపడిందని హిందూ గ్రూప్ తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ చెప్పారు. మసీదు ప్రాంగణంలోని ఉన్న దేవతల విగ్రహాలకు ఏడాది పొడవునా పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు పొడవునా ప్రవేశం కోరిన హిందూ మహిళల సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది చెప్పారు.
మసీదు ప్రాంగణంలోని చెరువును నమాజ్ సందర్భంగా శుద్ధి చేసుకోడానికి వినియోగిస్తున్నారని లాయర్ శుభాష్ నందన్ చతుర్వేది అన్నారు. ఇస్లామిక్ ‘వాజూ’ లేదా శుద్ధి కర్మ కోసం ఉపయోగించే చెరువును తప్పనిసరిగా సీలు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి చెరువును ఉపయోగించకుండా చూడాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడినట్టు నివేదికలు అందుతున్నా.. జిల్లా కలెక్టర్ మాత్రం ధ్రువీకరించలేదు.
జ్ఞాన్‌వాపి మసీదు సర్వే వివరాలను కమిషన్‌లోని సభ్యులెవరూ వెల్లడించలేదు.. సర్వే గురించి సమాచారం కోర్టు పర్యవేక్షణలో ఉంది… కమిషన్ నుంచి ఒక సభ్యుడ్ని తొలగించి మళ్లీ కొన్ని నిమిషాల తర్వాత చేర్చారని అధికారులు తెలిపారు.