జై శ్రీరాం మాత్రమే కాదు…! ఇకపై హర హర్ మహదేవ్…, శంభో శంకర్..! అని కూడా హిందువులు తలచి పులకించిపోయో రోజులొచ్చాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీం తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. పీఎం మోదీ, యూపీ సీఎం యోగిల ఏలుబడిలో శ్రీరామ మందిర నిర్మానానికి పునాదులు పడ్డాయి.
తాజాగా కాశీలోని జ్ఞానవాపీ మసీదుగా పిలువబడుతున్న ప్రాచీన విశ్వనాథ మందిరం కూడా హిందువుల పరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్ఞానవాపీ మసీదు స్థలంలో పూర్వం హిందూ దేవాలయం ఉండేదని.., దీనిపై సర్వే ఆఫ్ ఇండియా చేత సమగ్ర సర్వే చేయించాలని వీసీ రోహిత్గి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని విచారణకు స్వీకరించిన వారణాసి జిల్లా కోర్టు హిందువులకు అనుకూలంగా తన తుది తీర్పును ఇచ్చింది. అలాగే మసీదు పరిసర ప్రాంతాల్లో సర్వే కోసం 5గురు సభ్యులతో కూడిన ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అంతేకాదు ఈ ఐదుగురు సభ్యుల టీమ్ లో ఇద్దరు ముస్లింలు కూడా ఉండాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపీ మసీదు నిర్మాణానికి ముందు ఆ స్థలంలో ప్రాచీన హిందూ దేవాలయం ఉండేదా? లేదా? అనే దానిపై సమగ్ర సర్వే చేసిన అనంతరం ఈ బృందం సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు.
కోర్టు తీర్పుపై హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే జ్ఞానవాపీ మసీదు గోడలపై ప్రాచీన కాలం నాటి శివాలయానికి సంబంధించిన గుర్తులు, స్తంభాలు, శిల్పాలు స్పష్టంగా ఉన్నాయి. చూసేవారికి ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఇట్టే చెప్పవచ్చు. దీంతో కాశీ విశ్వనాథ మందిరం కూడా త్వరలోనే పూర్వవైభవానికి నోచుకోనుందని అంటున్నారు. అటు ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న మసీదు కమిటీ.. కోర్టు తీర్పు తమను నిరాశపర్చిందని, అయినా కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని తెలిపింది.
పరమ దుర్మర్గాడు… మతోన్మాదిగా పేరుగాంచిన మొగల్ పాలకుడు ఔరంగజేబు 1664లో కాశీలోని పవిత్రమైన విశ్వనాథ ఆలయాన్ని పడగొట్టించి.. ఆ మందిర శిధిలాలు, అవశేషాలపై మసీదును నిర్మించాడు. దాని చుట్టుపక్కల హిందువులు పూజలు చేయకుండా చేశాడు. ముస్లింల చెర నుంచి కాశీని విముక్తం చేయాలని మరాఠా పేష్వా మాధవరావు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు 18వ శతాబ్దంలో పుణ్యశీలి, దయామయి, మాతృమూర్తిగా పేరుగాంచిన అహల్యబాయి హోల్కర్ మహారాణి.. కాశీలో ప్రస్తుతమున్న మందిర స్థలాన్ని కొనుగోలు చేసి.. జ్ఞానవాపీ మసీదుకు గొడ పక్కనే మరోక మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం హిందూ సమాజం ఈ మందిరంలో పూజలు నిర్వహిస్తోంది. విశ్వానాథ మందిరాన్ని అనుకుని.. మందిర అవశేషాలపై ఔరంగజేబు నిర్మించిన మసీదు మాయని మచ్చలా ఇప్పటికీ కనిపిస్తుంది. సిక్కుల రాజు మహారాజా రంజిత్ సింగ్… హోల్కర్ మహారాణి నిర్మించిన విశ్వనాథ ఆలయం శిఖరంపై బంగారు కలశాన్ని స్థాపించారు. మందిరం కూల్చి… మసీదు కట్టిన చోటునే భవ్యమైన శివాలయం నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తోంది. అయోధ్య మందిరం నిర్మాణం తర్వాత… కాశీ మథురా బాకీ హై..! అనేది విశ్వహిందూ పరిషత్ నినాదం.
మన దేశంలో వివిధ కాలల్లో ముస్లింల పాలకుల చేతుల్లో దాదాపు 33 వేలకు పైగా ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. వీటిల్లో అయోధ్య, కాశీ, మథుర ఆలయాలు హైందవ ధర్మానికి ప్రతీకలుగా భావించే శ్రీరాముడు, శివుడు, శ్రీకృష్ణుడికి చెందినవి. దేశంలోని ప్రతి హిందువు ఈ ముగ్గురు దేవుళ్ళును తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. నిత్యం పూజిస్తారు. తాజాగా కాశీలోని జ్ఞానవాపీ మసీదుగా పిలువబడుతున్న ప్రాచీన విశ్వనాథ మందిరం కూడా పూర్వవైభవానికి నోచుకోవడంతో భారతీయుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.