కాంతారా ఓటీటీ వెర్షన్ కు ‘వరాహరూపం’ ఒరిజినల్ సాంగ్

0
609

కాంతార చిత్రం గురించి దేశం మొత్తం మాట్లాడుకున్నారు. ఈ కన్నడ చిత్రం పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాదు, ఇందులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ చిత్రం ఓటీటీలోనూ విడుదలైంది. అయితే కాంతారలో ఎంతో ముఖ్యమైన వరాహరూపం సాంగ్ ఒరిజనల్ వెర్షన్ ఓటీటీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ పాట కాపీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో, కేరళ కోర్టు ఆంక్షలు విధించడంతో ఆ పాట లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కోర్టులో కాంతార టీమ్ కు తాజాగా ఊరట కలిగింది. ఈ పాటపై గతంలో ఇచ్చిన స్టేను కోర్టు ఎత్తివేసింది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. ప్రజల ప్రేమాభిమానాల ఫలితంగా కోర్టులో తమకు అనుకూల నిర్ణయం వచ్చిందని.. త్వరలోనే కాంతార ఓటీటీ వెర్షన్ కు వరాహరూపం ఒరిజినల్ సాంగ్ జత చేస్తామని వెల్లడించారు.

కాంతారా సినిమా తెలుగులోనూ భారీ కలెక్షన్స్ ను సాధించింది. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా 50 రోజులను పూర్తిచేసుకుంది.