More

    త్వరలో ఏపీకి కూడా వందే భారత్ ఎక్స్ ప్రెస్

    ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. విశాఖ బహిరంగ సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. 446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్‌ను వరల్డ్ క్లాస్ లెవెల్లో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని.. ప్రధాని మోదీ నిర్ణయాలతో రైల్వే వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఏపీలో కూడా వందే భారత్ రైలును ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లినప్పుడే అభివృద్ధి జరుగుతుందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 వేల 668 గ్రామాల్లో వరల్డ్ క్లాస్ మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తున్నామని వివరించారు. కొత్త స్టేషన్, కొత్త ఏయిర్‌పోర్ట్, కొత్త ట్రైన్లు, ఎకనామిక్ కారిడార్స్‌, డిఫెన్స్ ప్రొటెక్షన్‌తో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో రూ. 10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

    Trending Stories

    Related Stories