More

    మొహాలీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వల్లభనేని వంశీ

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయన పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన వైసీపీ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్ రాష్ట్రం మొహాలీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వెళ్తున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడి వైద్యులు వంశీకి పలు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చూసించారు. వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

    Trending Stories

    Related Stories