ఎవరికైనా సరే సొంత ఇమేజ్ అంటూ ఉండాలి.! ఎంత సేపు… ఫలానా కుటుంబానికి.., ఆయన అల్లుడంట… అని అనడం.., స్వాభిమానమున్న ఎవరికైనా సరే నచ్చదు.! కానీ ఏం చేస్తాం…! అటు అత్త.. ఇటు వైఫ్.. మరోవైపు బామ్మర్థి…! పార్టీలో పెత్తనం అంతా వీరిదే..! రాజకీయాలకు సంబంధించి… అయితే గియితే వాళ్లే మాట్లాడాలి…! అతనికి మాత్రం నో ఛాన్స్! దీంతో ఏమనుకున్నాడో తెలియదు కానీ..! నేను మాట్లాడితే తప్పేంటి? తన బామ్మర్ధి పెరుగుతున్న పెట్రో ధరలపై ఇప్పటికే ట్వీట్ చేశాడు. ఈ అంశాన్నే తీసుకుని… కాసింత డిఫరెంట్ గా … ఏదైనా చేయాలనుకున్నాడు.
ఇంకేం ఐడియా వచ్చుడే ఆలస్యం..! సైకిల్ తీసుకున్నాడు…ఆఫీసునకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అయితే అతను ఆఫీసుకు… సైకిల్ మీద వెళ్తున్నాడన్న విషయం అతని వరకే పరిమితమైతే ఎలా?
నలుగురి జనాలకు తెలియాలి.! వాళ్లు…. అతను సైకిల్ మీద వెళ్తున్న విజువల్స్ ను చూడాలి.! సోషల్ మీడియాలో అతని గురించి చర్చించుకోవాలి. ! క్షణాల్లో వెదర్.. గుడ్ ఆర్ బ్యాడ్…, ఫలాన ఆయన.. సైకిల్ తొక్కుతూ ఆఫీసునకు వెళ్లాడనే టాఫిక్…, ట్రేడింగ్ లోకి రావాలనుకున్నాడో తెలియదు. కానీ..! అందుకోసం వెంటనే రేటింగ్ ఉన్న ఓ నేషనల్ మీడియా రిపోర్టర్ కు కబురు పెట్టాడు. ఆమె కోసం కూడా ఓ సైకిల్ అరెంజ్ చేశాడు.
ఒకే కెమెరా రోల్…అనగానే.., ఇక పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా… అతను సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. అతని పక్కనే ఆ రిపోర్టర్ సైతం సైకిల్ తొక్కుతూనే.., ప్రశ్నలు అడగడం మొదలు పెట్టింది. దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అల్లుడుగారి నిట్టూర్పు!.
స్క్రీన్ ప్లే…, డైరెక్షన్…, యాక్షన్ పక్కాగానే ఉన్న… ఎక్కడో కొడుతున్నట్లుగా ఉంది కదా శీనా..!
అసలు విషయం ఏంటంటే అల్లుడిగారి సైకిల్ స్టంట్ సీన్ బాగానే ఉన్నా…, అతని వెనుకాలే.. లక్షల రూపాయల ఖరీదైన లాండ్ క్లూసర్ కారు వారిని ఫాలో అవుతోంది. సెక్యూరిటీ టీమ్ పరుగెడుతూ వస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగితే కార్ ఇంటికాడ పెట్టి కదా మనోడు ఆఫీసుకు సైకిల్ మీద కదా వెళ్తున్నాడు..! ఏంటో లాజిక్ కు అందడం లేదు కదా…!
ఇంకా ఈ స్టంట్ లో కొసమెరుపు ఏమిటంటే…, అల్లుడిగారిని ప్రశ్నలు అడిగేందుకు ఆయాసపడుతూ సైకిల్ తొక్కిన ఆ రిపోర్టర్ చివరకు… సైకిల్ పై నుంచి పడిపోయింది . పడిపోయిన ఆమె వెంటనే పక్కనున్న అల్లుడిగారి అంగరక్షకులు పైకి లేపారు.!
మొత్తంగా ఈ స్టోరీలో…, నిరసన తెలపడం అనేది ఒక బహానాగా , పుల్ ఆఫ్ పబ్లిసీటి స్టంట్ గా చూసేవారికి ఇట్టే అర్థమవుతోంది కదా..!