ఇకపై రోడ్డు పక్కన షాపుల్లో మాంసం వేలాడుతూ కనిపించకూడదు

0
1037

మాంసాహారం వేలాడుతూ బయటకు కనిపించేలా ఉంచకూడదు. ఈ నిర్ణయం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర లో ఇకపై అమలు చేయనున్నారు. మాంసాహారాన్ని బహిరంగంగా విక్రయించే వీధి వ్యాపారులకు జరిమానా విధించేందుకు వడోదర లో ఒక డ్రైవ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. వడోదరలోని పౌర పాలకమండలి అధికారులు ఫుడ్ స్టాల్స్‌లో మాంసాహార ఆహారాన్ని కనిపించే విధంగా’ విక్రయించకుండా చూసుకోవాలని ఆదేశించారు. అటువంటి స్టాల్స్, బండ్లు మాంసం తగిన విధంగా ‘కవర్’ చేసుకోవాలని సూచించారు. గుడ్లతో తయారు చేసిన ఆహార పదార్థాలను విక్రయించే బండ్లకు కూడా ఈ నియమాలు వర్తించనున్నాయి.

ఫుడ్ స్టాల్స్‌లో మాంసాహార ఆహారాన్ని ‘కనిపించేలా’ విక్రయించకుండా చూసుకోవాలని వీధి వ్యాపారులను వడోదర అధికారులు ఆదేశించారు. అటువంటి స్టాల్స్, బండ్లపై మాంసాహారాన్ని కప్పి ఉంచాలని సూచించారు. గుజరాత్‌లోని మరో నగరమైన రాజ్‌కోట్‌లో మాంసాహారాన్ని విక్రయించే స్టాల్స్‌ను హాకింగ్ జోన్‌లకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్‌ వెజ్‌ స్టాల్స్‌, బండ్లను ప్రధాన రహదారులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వడోదరలో కూడా అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టారు.

వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ హితేంద్ర పటేల్ ఈ కొత్త నియమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాంసాహార ఫుడ్ ఏదీ కనిపించకుండా చూసుకోవాలని.. ఇది మన మతపరమైన భావాలకు సంబంధించినదని అన్నారు. బహిరంగంగా కనిపించేలా మాంసాహారం ఉంచుతూ అమ్మే ఆచారం చాలా ఏండ్లుగా కొనసాగుతోంది. కానీ సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని ఆయన అన్నారు.