National

వ్యాక్సిన్లను ఏకంగా పాతి పెడుతున్న రాజస్థాన్ ప్రభుత్వం

దేశంలోని కొన్ని రాష్ట్రాలలో వ్యాక్సిన్ వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజీ ఎక్కువగా ఉందని ఎప్పటికప్పుడు అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనల ద్వారా తెలుస్తోంది. హిందీ డైలీ ‘భాస్కర్’ గత వారం రాజస్థాన్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను వృధా చేస్తున్నారని కథనాన్ని ప్రచురించింది. 500కు పైగా వయల్స్ ను చెత్తలో పడేశారని భాస్కర్ సంస్థ సాక్ష్యాలతో సహా నిరూపించింది. వీటితో 2500 డోసులను ప్రజలకు వేసే అవకాశం ఉన్నా కూడా రాజస్థాన్ లోని ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవన్నీ చెత్తబుట్టల్లోకి చేరుతూ ఉన్నాయని గుర్తించారు.

జూన్ 3న ‘దైనిక్ భాస్కర్’ మీడియా సంస్థ పలు విషయాలను బయట పెట్టింది. రాజస్థాన్ రాష్ట్రంలో వ్యాక్సిన్లను కేవలం చెత్తబుట్టల్లో పడేయడం మాత్రమే కాకుండా.. కొన్నిచోట్ల వ్యాక్సిన్లను తగులబెట్టడం కూడా గుర్తించారు. కావాలనే కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది ఈ పనికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ మాత్రం తమ రాష్ట్రంలో వ్యాక్సింగ్ వేస్టేజీ అసలు జరగడం లేదని చెబుతూ వస్తున్నారు. కానీ దైనిక్ భాస్కర్ మాత్రం సాక్షాలతో సహా వ్యాక్సింగ్ వేస్టేజీని బయట పెట్టింది. కొన్ని చెత్తకుప్పల్లో సైతం మీడియా సిబ్బంది దిగి వెతకగా.. వ్యాక్సిన్లను పడేసి ఉండడాన్ని ధృవీకరించారు.

దైనిక్ భాస్కర్ కు చెందిన టీం దాదాపు పది ఆస్పత్రుల్లో వేస్టేజ్ గురించి ఆరా తీశారు. కొన్ని ఆస్పత్రుల్లో ఇంకా 80% మిగిలి ఉన్న వయల్స్ ను చెత్తబుట్టల్లో పారవేయడాన్ని గుర్తించారు. 12 అడుగుల లోతు ఉన్న గార్బేజీ పిట్ లో కూడా ఈ వ్యాక్సిన్లను గుర్తించారు. తామే వ్యాక్సిన్లను చెత్త బుట్టలో పడవేశామని ఓ ఆసుపత్రి సిబ్బంది కూడా తెలిపింది.

ఈ వ్యాక్సిన్ వేస్టేజీ ని బయటపెట్టిన మీడియా సంస్థ కు రాజస్థాన్ ప్రభుత్వం నుండి బెదిరింపులు కూడా మొదలయ్యాయి. లీగల్ యాక్షన్ తీసుకుంటామని రాజస్థాన్ ఆరోగ్య విభాగం హెచ్చరిస్తోంది. దైనిక్ భాస్కర్ మాత్రం వ్యాక్సిన్లకు సంబంధించిన ఫోటోలను కూడా బయట పెట్టింది. బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ వంటి విషయాలను స్పష్టంగా ప్రజల ముందుకు ఉంచింది సదరు మీడియా సంస్థ. అయితే ప్రజలను తప్పుద్రోవ పట్టించే వార్త అంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది. ఎక్స్పైరీ అయిన వ్యాక్సిన్లను చెత్త బుట్టలో పడవేసింటే ఇలా రాద్ధాంతం చేస్తున్నారని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నించింది. రాజ‌స్థాన్ లోని ప‌లు జిల్లాల్లో వ్యాక్సిన్ల‌ను వ్యర్ధం చేస్తున్నార‌నే వార్త‌ల‌ను రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ కూడా తోసిపుచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వ్యర్ధంపై కేంద్రం త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఆరోపించారు.

వ్యాక్సిన్ల‌ను రాజ‌స్థాన్ లో చెత్త కింద ప‌డేస్తున్నార‌నే వార్త‌ల‌పై కేంద్ర మంత్రి ప్రకాష్ జ‌వ‌దేక‌ర్ రాజస్థాన్ అశోక్ గెహ్లోత్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ‌స్థాన్ లో వ్యాక్సిన్ల‌ను మొద‌ట చెత్త‌డ‌బ్బాల్లో విసిరివేశార‌ని, ఇప్పుడు వాటిని పాతిపెడుతున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ టూల్ కిట్ లో ఇది ఓ భాగ‌మా అని ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేశారు.రాజ‌స్ధాన్ లో వ్యాక్సిన్ల వ్యర్ధంపై ద‌ర్యాప్తు చేపట్టాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × one =

Back to top button