More

    ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలను ఈ ధరలకు మాత్రమే అమ్మాలి

    ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాలకు కేంద్రం కొత్త ధరలను నిర్ణయించింది. కోవిషీల్డ్ ధరను గరిష్ఠంగా డోసుకు రూ.780, కోవాగ్జిన్‌ డోసుకు రూ.1,410గా నిర్ణయించింది. స్పుత్నిక్‌-వి టీకాకు ఒక్కో డోసుకు గరిష్ఠంగా రూ.1,145 వసూలు చేసేందుకు అనుమతించింది. రూ.150 సర్వీసు ఛార్జీతో పాటు పన్నులు కూడా కలుపుకొని ఈ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.

    కరోనా వ్యాక్సిన్లను ఎక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందుకే టీకాల గరిష్ఠ ధరలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.150 కంటే ఎక్కువ సర్వీసు ఛార్జీలను వసూలు చేయొద్దని.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ల ధరల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ విషయంలో ఇటీవలే కీలక ప్రకటన చేశారు.18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ప్రైవేటుగా వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు వేసుకోవచ్చని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. నిర్ధిష్ట ధరను విధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ 5 శాతం, 150 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అదనంగా ఉండనుంది.

    కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక్కొక్క డోసు 780 రూపాయలు
    కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర ఒక్కొక్క డోసు 1410 రూపాయలు
    స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ ధర ఒక డోసు 1145 రూపాయలు

    Related Stories