National

ప్రధాని మోదీ పుట్టినరోజున వ్యాక్సినేషన్ లో చరిత్ర సృష్టించిన భారత్

భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజే 2.5 కోట్ల వ్యాక్సిన్లను భారత్ లో వేశారు. ఇలా ఒక్క రోజులోనే ఇన్ని వ్యాక్సిన్లు ప్రపంచంలో ఏ దేశంలోనూ చోటు చేసుకోలేదు. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం నుండి దేశంలో వ్యాక్సినేషన్ ఒక ఉద్యమంలా సాగింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి రికార్డులు బద్దలు కొట్టింది భారత్. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం భారీఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టారు. చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, అదే మోదీకి… ఆయన పుట్టిన రోజు సందర్భంగా మనం ఇచ్చే బహుమతి అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. దీంతో వ్యాక్సినేషన్‌ జోరుగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెద్ద ఎత్తున డోసులను పంపిణీ చేశారు. సాయంత్రానికే 2 కోట్లపైగా వ్యాక్సినేషన్ ఇచ్చారు.

రాత్రి 11:58 సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కరోజులోనే 2.5కోట్ల వ్యాక్సిన్లు వేశామని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు సృష్టించామని శుక్రవారం రాత్రి 11:58 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా “చారిత్రాత్మక” సంఖ్యను నిర్ధారించడానికి ట్వీట్ చేసారు. అంతకుముందు ప్రధాని మోదీ కూడా ట్విట్టర్‌లో వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావించారు. ప్రతి భారతీయుడు నేటి రికార్డు టీకాల వ్యాక్సినేషన్ గురించి గర్వపడతాడని ప్రకటించారు. టీకా డ్రైవ్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

2.5 కోట్ల టీకాల లక్ష్యం ప్రభుత్వం పెట్టుకోగా.. అంతకంటే 10,390 ఎక్కువ టీకాలను వేసింది. చైనా ఒక రోజులో 2.47 కోట్ల టీకాలు జూన్‌ నెలలో వేయగా.. భారత్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. శుక్రవారం సాయంత్రం దేశం రెండు కోట్ల వ్యాక్సిన్ మార్కును దాటినప్పుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయ ఆసియా కార్యాలయం తన అభినందనలు చెబుతూ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ట్రాకర్ సెకనుకు 800 టీకాలు లేదా ఒక నిమిషంలో 48,000 టీకాలు చూపించూపించింది. నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ శుక్రవారం “చారిత్రాత్మక రోజు” అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల కృషిని ప్రశంసించారు. ఎయిమ్స్ (ఢిల్లీ) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ టీకా సంఖ్యల పెరుగుదలను కొనసాగించడం అత్యవసరమని అన్నారు. డిసెంబర్ చివరి నాటికి జనాభాలో కనీసం 60 శాతం మందికి రెండు డోస్‌లు అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని అన్నారు.

Related Articles

Back to top button