More

    ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా

    అంతా ఊహించినట్లుగానే ఉత్తరాఖండ్ సీఎం..త్రివేంద్ర సింగ్ రావత్  తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రావత్ నాయకత్వంపై ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు.., అలాగే ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి తోడు రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి.

    అటు.. అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం.. రావత్ ను సోమవారం ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు…, ఉత్తరాఖండ్ బీజేపీ వ్యవహరాల ఇన్ చార్జ్ రమణ్ సింగ్…, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలతోపాటు, పార్టీ నాయకులు, కోర్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. దాదాపు పది మంది ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది మంత్రులు సైతం రావత్ ను మార్చాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన బీజేపీ అధిష్ఠానం.. చివరకు రావత్ ను మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

    అధిష్ఠానం ఆదేశం మేరకు రావత్ తన రాజీనామా లేఖను  గవర్నర్ కు సమర్పించిన తర్వాత.. మీడియా తో మాట్లాడారు. తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని.., సామాన్యకార్తగా బీజేపీలోతన ప్రస్థానం మొదలు పెట్టి… సీఎం పదవిని చేపట్టానని…ఇలాంటివన్నీ కూడా కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. నాలుగేళ్ళపాటు రాష్ట్రానికి సేవ చేశానని…, ఇప్పుడు ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని పార్టీ ఆదేశించిందని,.. తన తర్వాత ఈ పదవిని ఎవరు చేపట్టినా…, వారికి తన సహకారం ఉంటుదని రావత్ తెలిపారు.

    మరోవైపు… సీఎం రేసులో… రాష్ట్ర టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్, అలాగే కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్, లోక్ సభ సభ్యడు అజయ్ భట్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, అలాగే ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సహాయ మంత్రి ధన్ సింగ్ రావత్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ భట్ ఉన్నట్లు ప్రచారం జరిగింది.

    అయితే.. బీజేపీ అధిష్ఠానం మాత్రం ధన్ సింగ్ రావత్ కే సీఎం పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తదుపరి సీఎం ఎంపిక కోసం ఉత్తరాఖండ్ బీజే ఎల్పీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశంకానుంది. 

    Trending Stories

    Related Stories