సెక్యులర్ దేశంలో సెక్యులర్ ప్రభుత్వాలు…హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడం ఏంటి? ప్రభుత్వాల చెరలో ఉన్న హిందూ దేవాలయాలకు విముక్తి ఎప్పుడు? ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న హిందూ దేవాలయాల విముక్తి కోసం సాధుసంతుల నేతృత్వంలో హిందూ సమాజం ఉద్యమానికి శ్రీకారం చూడుతున్న వేళా… ఉత్తరాఖండ్ సీఎం తీర్థ్ సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ అదేంటో తెలుసా? ప్రభుత్వం తన ఆధీనంలోని తీసుకున్న చార్ ధామ్ ఆలయాలతోపాటు, రాష్ట్రంలోని 51 దేవాలయాలను తిరిగి హిందూ సమాజానికి అప్పగిస్తామని ఆయన చెప్పారు.
తీర్థ్ సింగ్ రెండు నెలల క్రితమే..త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ సహా ఉత్తరాఖండ్ లోని దాదాపు 51 ప్రముఖ దేవాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ దేవస్థానాల నిర్వహణ చట్టాన్ని తీసుకుని వచ్చారు.
అయితే ఈ చట్టాన్ని చార్ ధామ్ క్షేత్ర పూజారులతోపాటు సాధు సంతులు తీవ్రంగా వ్యతిరేకించింది. గత మూడు నెలల నుంచి రాష్ట్రంలోని సాధు సమాజంతోపాటు, పూజారులు రాష్ట్రంలో వరుస ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ సైతం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిచింది. ఒకవైపు ప్రభుత్వాల ఆధీనంలోని దేవాలయాల విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న తరుణంలో..ఉత్తరాఖండ్ సర్కార్ తీసుకువచ్చిన ఈ చట్టంపై తీసుకుని రావడమేంటని ప్రశ్నించింది. ప్రజల్లో రోజు రోజుకు ప్రజల్లో పెరిగిపోతున్న ప్రజాగ్రహం నేపథ్యంలో బీజేపీ అధిష్టానం త్రివేంద్ర సింగ్ ను తప్పించి..ఆయన స్థానంలో తీర్థ్ సింగ్ రావత్ కు సీఎం బాధ్యతలు కట్టబెట్టింది.
ఏప్రిల్ 9వ తేదీన విశ్వహిందూ పరిషత్ నేతలు, సాధు సంతులు సీఎం తీర్థ్ సింగ్ ను కలిసి ప్రభుత్వ తీసుకువచ్చిన చట్టాన్ని పునఃసమీక్ష జరిపి..చార్ ధామ్ క్షేత్రాలతోపాటు, 51 దేవాలయాలను తిరిగి హిందూ సమాజానికి కట్టబెట్టాలని వినతి పత్రం సమర్పించింది. దీంతో సీఎం తీర్థ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆలయాలను తిరిగి హిందూ సమాజానికే కట్టబెట్టబడతానని హామీ ఇచ్చారు.
అటు తమిళనాడులో ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ ఆధీనంలోని హిందూ దేవాయాలకు విముక్తి కల్పిస్తామని…, ఆయా దేవాలయాల నిర్వహణ బాధ్యతను సాధు సంతులతో కూడిన ఓ ధార్మిక బోర్డును ఏర్పాటు చేసి వారికి అప్పగిస్తామని.., దేవాలయాల వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం లేకుండా చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.