భారతీయులకు అమెరికా సర్కారు ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డ్‌లను కోరుకునే వారితో పాటు ఎంప్లాయీమెంట్ ఆథరైజేషన్ కార్డులు పొందిన H-1B వీసా హోల్డర్‌ల జీవిత భాగస్వాములతో సహా నిర్దిష్ట వర్గాలకు చెందిన వలసదారులకు గడువు ముగిసిన వర్క్ పర్మిట్లను ఏడాదిన్నర పాటు పొడగిస్తున్నట్లు బిడెన్ పరిపాలన ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం నిర్ణయంతో వేలాది భారతీయ వసలదారులకు లబ్ధి చేకూరనున్నది. 180 రోజుల పొడిగింపును ఆటోమెటిక్‌గా 540 రోజులకు పెంచుతున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఈ నిర్ణయంతో 4.20లక్షల మంది వసలదారులకు లబ్ధి కలుగనున్నదని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా చెప్పారు.