More

    హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్‌ పోర్న్‌ గ్యాంగ్‌.. మూడు లొకేషన్స్ లో..!

    హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్‌ పోర్న్‌ గ్యాంగ్‌ పని చేస్తున్నట్లు అమెరికాకు చెందిన సైబర్ టిప్‌లైన్ సంస్థ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. గత కొద్దిరోజులుగా.. యాక్టివ్ గా ఉన్న ఈ చైల్డ్ పోర్న్ గ్యాంగ్ సంస్థలు పిల్లల పోర్న్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉన్నాయి. రసూల్‌ పురా, టోలిచౌకి, వారాసి గూడా ఏరియాల నుంచి 2017, 2019, 2020 లలో విడియోలు అప్లోడ్ చేశాయి ఈ ముఠాలు. త్వరలోనే వీరిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. 2021 లో హైదరాబాద్ లో చైల్డ్‌పోర్న్‌ వీడియోస్‌ అప్‌లోడ్‌ చేస్తోన్న 16 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020 లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలను ఫార్వర్డ్ చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మరో మూడు కేసులను గుర్తించింది సైబర్‌ టిప్‌ లైన్‌. అప్‌లోడ్ చేసిన వీడియోల ఆధారంగా హైదరాబాద్‌లో మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించి వివరాలను తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి అందించారు. సైబర్‌ టిప్‌ లైన్‌ తెలంగాణలో మూడు చైల్డ్‌పోర్న్‌ కేసులను గుర్తించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి చైల్డ్‌ పోర్న్‌ వీడియోస్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నట్టు సైబర్‌ టిప్‌ లైన్‌ గుర్తించింది. ఐపీ అడ్రస్‌ల ద్వారా నేరస్తులను గుర్తించారు హైదరాబాద్ పోలీసులు.

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), ఇండియా మరియు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC), USA మధ్య అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేసిన తర్వాత 2019లో సైబర్ టిప్‌లైన్ ఏర్పాటు చేయబడింది. NCRB భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సైబర్ టిప్‌లైన్ నివేదికలను ఫార్వార్డ్ చేస్తుంది. సైబర్ టిప్‌లైన్ అనేది పిల్లల అశ్లీలత, లైంగిక వేధింపుల కోసం పిల్లలను ఆన్‌లైన్‌లో ప్రలోభపెట్టడం, ఫ్యామిలీలో పిల్లలను వేధించడం, పిల్లలకు పంపిన అశ్లీల విషయాలతో సహా పిల్లల లైంగిక దోపిడీ కేసుల కోసం నిర్వహించబడే రిపోర్టింగ్ మెకానిజం.

    Trending Stories

    Related Stories