టాప్ సింగర్ సిద్ శ్రీరామ్ స్వరంతో “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి అక్టోబర్ 10 న రిలీజ్ కానున్న లవ్లీ మెలోడీ “దీంతననా” సాంగ్

0
809

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రతిష్టాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”.

అల్లు శిరీష్,అను ఇమ్మన్యుల్ నటిస్తున్న “ఊర్వశివో రాక్షసివో” చిత్రంపై ఇదివరకే మంచి అంచనాలు నెలకొన్నాయి.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత బలపరించింది. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా నేడు ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
“అనగా అనగనగా,కనులే కలగనగా,
నిజమై మెరుపై వాలేగా,
నా ఊపిరి నడక తన ఊపిరి జతగా
కలగలిసి మొదలై నాలో అలజడిగా” అనే లైన్స్ తో మొదలైన ఈ పాట మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. తన పాటలతో మిలియన్స్ వ్యూస్ ను దాటించే సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.ఈ పాట కూడా ఒక లవ్లీ మెలోడీగా ఉండబోతుంది. అక్టోబర్ 10న “దీంతననా” అనే ఈ మొదటి పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

“ఊర్వశివో రాక్షసివో” చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 4 =