More

    జుట్టు కత్తిరించేసుకున్న ఊర్వశి

    ఇరాన్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు కూడా జుట్టు కత్తిరించుకుని నిరసన తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఆ లిస్టులో చేరారు. అయితే తాను కూడా మోహాసా అమీనీ వంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని వాపోయింది. మహిళలు తమ హక్కుల కోసం పోరాడితే తప్పా అంటూ తాను జుట్టును కత్తిరించుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బాలికలు,యువతులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వారికి గౌరవం దక్కడంలేదని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు వారి జుట్టే అందమని, కానీ ఈ సమాజం చూపుతున్న వైఖరికి నిరసనగా వారు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని తెలిపింది. ‘ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను.. అయితే రిషభ్ పంత్ ఇక్కడికి వచినందునే నేను కూడా వచ్చానంటూ నెటిజన్లు ట్విటర్లలో నన్ను దారుణంగా వేధిస్తూ మానసిక క్షోభ పెడుతున్నారు.. దయచేసి వాళ్ళు ఈ ట్రోలింగ్ మానాలి’ అని ఊర్వశి రౌతేలా విజ్ఞప్తి చేసింది.

    మహిళలు తప్పనిసరిగా హిజాబ్ నిబంధనలు పాటించేలా చేసే ఇరాన్ పోలీసులు అమీనీ హిజాబ్‌ ధరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచారు. పోలీసు కస్టడీలో ఉండగా అమీనీ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె తలపై బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా ఈ నిరసనల్లో భాగమయ్యారు.

    Trending Stories

    Related Stories