సివిల్స్ 2021లో శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది. తన విజయ ప్రస్థానంలో పేరెంట్స్, ఫ్రెండ్స్ పాత్ర కీలకమైందని ఆమె అన్నారు. వారెంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. కష్టంతో పాటు సహనం చాలా అవసరమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో శ్రుతి శర్మ చదివింది.
అయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తానేమీ అంచనా వేయలేదని చెప్పింది. ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని ఆమె అన్నారు. తన జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని, ముఖ్యంగా పేరెంట్స్‌కు అని ఆమె తెలిపారు. తనకు తన పేరెంట్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారని, ఫ్రెండ్స్ కూడా మంచి గైడెన్స్ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి శ్రుతి శర్మ పీజీ చదివారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఆమె సివిల్స్ కోసం ప్రిపేరవుతోంది. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో ఆమె స్టూడెంట్‌గా ఉన్నారు. యూజీపీ ఫండ్స్‌తో ఆర్సీఏ నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ కోచింగ్ అకాడమీ నుంచి 23 మంది విద్యార్థులు పరీక్ష క్లియర్ అయినట్లు జామియా అధికారి ఒకరు తెలిపారు. 2021 పరీక్షల్లో మొదటి నాలుగు ర్యాంక్‌లు మహిళలే దక్కించుకున్నారు. 685 మంది సివిల్స్ క్వాలిఫై అయ్యారు.
రెండవ ర్యాంక్ సాధించిన అంకితా అగర్వాల్.. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయ్యింది. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెటెక్‌తో ఆమె పరీక్ష రాశారు. గామిని సింగ్లాకు మూడవ ర్యాంక్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌లో ఆమె బీటెక్ చేశారు. సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నది. టాప్ 25 ర్యాంకుల్లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు.
సివిల్స్ -2021లో తెలుగువారి విషయానికి వస్తే యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య.. 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి.. 56వ ర్యాంకు, శ్రీపూజ.. 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి.. 69వ ర్యాంకు, ఆకునూరి నరేశ్.. 117వ ర్యాంకు, అరుగులు స్నేహ.. 136వ ర్యాంకు, బి చైతన్య రెడ్డి.. 161వ రెడ్డి, ఎస్ కమలేశ్వర్ రావు.. 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్.. 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్.. 350వ ర్యాంకు, గుగులావత్ శరత్ నాయక్.. 374వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ.. 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య.. 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్.. 564వ ర్యాంకు, రంజిత్‌కుమార్.. 574వ ర్యాంకు, పాండు విల్సన్.. 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్.. 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్.. 676వ ర్యాంకు సాధించారు.