More

    దూకుడు పెంచేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

    తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు. తాజాగా 80 నియోజకవర్గాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను నియమిస్తూ బండి సంజయ్ ప్రకటన జారీ చేశారు. నియోజకవర్గాల్లోని స్థానిక నేతలను కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడం, పార్టీ నేతల మధ్య విబేధాలను పరిష్కరించడం, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం, స్థానిక ప్రజా సమస్యలను గుర్తించి పోరాటం చేసే బాధ్యతలను కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లకు అప్పగించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికి సహాయం చేసేందుకు, తోడుగా ఉండేందుకు వీరిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇటీవలే 30 నియోజకవర్గాలకు కన్వీనర్లను ప్రకటించగా.. ఇప్పుడు 80 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 110 సెగ్మెంట్లకు నియమించారు.

    ఇక ఈ నెలాఖరులో బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు విడుతల పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. త్వరలోనే ఐదో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్ర మొదలుకానుందని.. నిర్మల్ లోని భైంసా నుంచి యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 18 నుంచి 20 రోజుల పాటు పాదయాత్రను నిర్వహించాక కరీంనగర్‌లో బహిరంగ సభతో ఐదో విడత పాదయాత్ర ముగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

    Trending Stories

    Related Stories