More

    మోదీ, యోగిలపై గ్రామ పెద్ద నోటి దురుసు..! ‘సత్తార్’ తాట తీసిన యూపీ పోలీస్..!!

    అతనో గ్రామ పెద్ద. యూపీలో ఓ గ్రామానికి సర్పంచ్ కూడా. పేరుకు గ్రామ పెద్ద అయినా,.. వ్యక్తిత్వంలో మాత్రం ఆ పెద్దరికం ఏ కోశానా కనిపించదు. గ్రామ పెద్ద హోదాలో ఉన్నా,.. మాటలు మాత్రం అత్యంత హీనంగా ఉంటాయి. అయితే, ఇటువంటి హీనమైన భాషను ఏదో చిన్న వారిపై ప్రయోగించి ఉంటే,.. అతడిని ఛీ కొట్టి వెళ్ళిపొమ్మనేవారు. కానీ, ఆయన ఏకంగా యూపీ సీఎం యోగి,.. ప్రధాని మోదీ పై పరుష పదజాలం ఉపయోగించడంతో జైలుపాలయ్యాడు.

    ఇక వివరాల్లోకి వెళితే.. యూపీ కాన్పూర్‎లోని సదత్ గ్రామ పెద్ద సత్తార్,.. యోగి ఆదిత్యనాథ్‎పై,.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గ్రామస్థులపైనా దుర్భాషలాడాడు. పరుష పదజాలంతో,.. స్థానిక హిందూ మహిళలను కూడా భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడి వీరంగంతో గ్రామస్థులందరూ భయపడి,.. దుకాణాలు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది కాస్తా వైరల్ అయి,.. నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను అంకిత్ అనే యువకుడు ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. తన స్నేహితుడితో పాటు తాను సాదత్ గ్రామానికి వెళ్లిన సమయంలో,.. ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పాడు. అంతేకాదు, ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను కోరాడు.

    ఇక ఈ ట్వీట్‎పై యూపీ పోలీసులు స్పందించారు. నిందితుడు యూపీ సీఎం, ప్రధాని మోదీలపై అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడినట్లు తెలిపారు. ‘ఆగ్ లగా దో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలతో నిందించినట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు హిందూ మహిళలపై కూడా పరుష వ్యాఖ్యలు చేశారని అన్నారు. నిందితుడు సత్తార్‎ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,.. ఐపీసీ సెక్షన్ 504, 506, 295 – A ల కింద కేసును నమోదు చేశారు. సత్తార్‎ను అరెస్టు చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధానిపై అనుచితంగా వ్యాఖ్యానించేవారిని,.. ఏమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. సత్తార్ లాంటి వాడు గ్రామ పెద్దగా వ్యవహరించడానికి,.. ఏమాత్రం అర్హుడు కాడని విమర్శిస్తున్నారు. ఇటువంటి వారిని అస్సలు ఉపేక్షించకూడదని అంటున్నారు. ఇతడిపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories