యూపీ మసీదుల్లో లౌడ్ స్పీకర్లు బంద్

0
740

ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లీంలకు ఊహించని షాక్ ఇచ్చింది. మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఇప్పటికే మతపెద్దలకు నోటీసులు ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. ఇప్పుడు రంగంలోకి దిగి లౌడ్ స్పీకర్లు తొలగించే పనిలో నిమగ్నం అయ్యింది.

తమకు ఇబ్బంది కలిగించే విధంగా మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారని, అందుకే ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించామని అధికారులు అంటున్నారు. మసీదుల్లో ఇప్పటి వరకు ఎన్నివేల లౌడ్ స్పీకర్లు తొలగించాము అనే విషయంపై అలహాబాద్ హైకోర్టులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుల్లో, ప్రార్థనా మందిరాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు గుర్తించి వాటిని తొలగిస్తామని అధికారులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 జోన్లలో ఎక్కడెక్కడ ఎన్ని వేల లౌడ్ స్పీకర్లు తొలగించాము అనే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా లెక్కలను హైకోర్టుకు సమర్పించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన 10, 923 లౌడ్ స్పీకర్లు తొలగించింది. మతపరమైన ప్రాంతాల్లో 35, 221 చోట్ల లౌడ్ స్పీకర్ల సౌండ్ ను తగ్గించిందని అధికారులు అంటున్నారు. అయితే కొత్తగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చెయ్యడానికి ఎలాంటి అనుమతి మంజూరు చెయ్యబడదు అని అధికారులు తెలిపారు. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మసీదుల్లో, ప్రార్థనా మందిరాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు గుర్తించి వాటిని తొలగిస్తామని ఉత్దరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డీజీపీ ప్రశాంత్ కుమార్ అంటున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 జోన్లలో 10, 923 లౌడ్ స్పీకర్లు తొలగించాము అని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా లెక్కలను హైకోర్టుకు సమర్పించారు. లక్నో జోన్ లో 2,395, గోరఖ్ పూర్ జోన్ లో 1, 788, వారణాసి జోన్ లో 1, 366, మీరట్ జోన్ లో 1,204తో పాటు ప్రయోగ్ రాజ్ జోన్ లో అధిక సంఖ్యలో లౌడ్ స్పీకర్లు తొలగించామని ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే ధన్యవాదాలు తెలిపారు. యూపీలో ప్రార్ధనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు అభినందనలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అయితే తమ మహారాష్ట్రలో మాత్రం యోగిలాంటి నేతలు లేరని, అంతా భోగులే ఉన్నారని మహారాష్ట్ర పాలకులను ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో కూడా వెంటనే ప్రార్ధనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగిస్తే బాగుంటుందని రాజ్‌థాకరే సూచించారు. మే మూడు నాటికి మహారాష్ట్రలో మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే తాము మసీదుల బయట హనుమాన్ చాలీసా చదువుతామని రాజ్‌థాకరే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రార్ధనలు ఇళ్లలోనే చేసుకోవాలని, రోడ్లపైకి వస్తే ఊరుకోబోమని కూడా రాజ్‌థాకరే హెచ్చరించారు. దీంతో మహారాష్ట్ర్లలో ఒక్కసారిగా కలకలం రేగింది. రాజకీయాలు వేడెక్కాయి. లౌడ్ స్పీకర్లు తొలగించాలనే అంశంపై అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here