National

ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న నేతలు..! వాళ్లు దేశ వ్యతిరేక శక్తులకు ఎప్పుడూ ఎదురొడ్డి నిలబడుతూ ఉంటారు. ఇప్పటికే వారిని చంపాలనే ప్రయత్నాలను పలువురు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను బాంబులు పెట్టి పేల్చేస్తానంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్‌‌లో ఆదివారం పోస్ట్ అయిన దీనిపై యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామంటూ బెదిరిస్తూ చేసిన ట్వీట్ గురించి పోలీస్ హెల్ప్‌లైన్‌ 112కి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు ట్విటర్ నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లను బాంబుతో అంతం చేస్తానని బెదిరించడంతో యుపి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. “యూపీ 112 (పోలీస్ హెల్ప్‌లైన్) నుండి ఈ బెదిరింపు గురించి మాకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చిందని” డిసిపి (క్రైమ్) ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ట్విట్టర్‌‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో కావాలని ఈ పోస్ట్ పెట్టారు. అయితే ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అయ్యుండొచ్చు. సొంత పేరుతో కాకుండా ఫేక్ యూజర్‌‌ నేమ్‌తో ఆ ఖాతాను నడుపుతున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అసలైన నిందితుడిని పట్టుకునే వరకు ఆ పేరును బయటపెట్టడం సరైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడేందుకు.. ఖాతాలు ఫేక్ వే ఉంటాయని పలువురు నిపుణులు తెలిపారు. కొన్ని క్లూల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని తమ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ ఇప్పటికే ట్విట్టర్‌‌ను సంప్రదించిందని చెప్పారు. నిందితుడి వివరాలను సేకరించి, దర్యాప్తులో ముందుకు వెళ్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

five × three =

Back to top button