National

యూపీ మోడల్: 64 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు..!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ వస్తున్నాయి. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోతూ వస్తుంటే..భారీ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో కరోనా మహమ్మారి కట్టడి ఎలా చేయాలో చేసి చూపించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఎంతో గర్వంగా చెబుతూ ఉన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకుని వచ్చిన కార్యక్రమాలే..!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం జరిగిన కోవిడ్ -19 సమీక్ష సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని 64 జిల్లాలలో చైనా వైరస్ యొక్క తాజా కేసులు లేవని ప్రకటించారు. 28 జిల్లాలు కరోనా రహితంగా ఉండగా, 11 జిల్లాలు సింగిల్ డిజిట్ లో కరోనా కేసులను నివేదించబడ్డాయి. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన సిఎం యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో 227 యాక్టివ్ కోవిడ్ కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 12 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయని.. 15 రికవరీ కేసులు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం రికవరీ రేటు 98.7% ఉందని అధికారులు తెలిపారు.

వ్యాక్సినేషన్ లో దూసుకుపోతున్న ఉత్తరప్రదేశ్:

తాజా సమాచారం ప్రకారం సోమవారం నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 8 కోట్ల మార్కును దాటింది. 6.5 కోట్ల మందికి పైగా ప్రజలు మొదటి టీకాను పొందగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి పైగా డబుల్ డోస్ లు వేయించుకున్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌లో పౌరులను అభినందించడమే కాకుండా.. “టీకా జీత్ కా” ప్రచారాన్ని కొనసాగించాలని ప్రోత్సహించారు. “ఉత్తరప్రదేశ్ లో 8 కోట్ల 36 వేలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను ఇవ్వబడింది” అని ఆదిత్యనాథ్ తన ట్వీట్‌లో ప్రకటించారు.

సోమవారం నాడు లక్నో సరికొత్త రికార్డును సృష్టించింది. రాష్ట్రంలో ఒకే రోజు 1 లక్ష మందికి పైగా టీకాలు వేసిన మొదటి జిల్లాగా అవతరించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ వెళుతున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా యాక్టివ్ కేసులే లేనటువంటి రాష్ట్రంగా యూపీని తీర్చిదిద్దాలని భావిస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు వస్తుండగా.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం వందల్లో మాత్రమే నమోదవుతూ ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కరోనా కట్టడికి యూపీ మోడల్ ను అమలు చేయాలని పలువురు నిపుణులు చెబుతూ వస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =

Back to top button