ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వాగతం పలికారు. శాలువాతో యోగి ఆదిత్యనాథ్ ను సత్కరించారు. పలువురు బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ కు స్వాగతం పలికారు.
యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఉదయం యోగి అమ్మవారిని దర్శించుకుంటారని.. ఆయన పర్యటన కోసం పాతబస్తీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు.. ఇలా దాదాపు 350 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు.