More

    అఖిలేశ్ యాదవ్ ఇలాఖాలోనూ బీజేపీదే హవా..!

    ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. ఉప ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. అజంగఢ్, రాంపూర్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఎస్పీ నేత అజామ్ ఖాన్ అడ్డా అయిన రాంపూర్ లో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ లోధీ 42 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్థానం అజంగఢ్ లోనూ బీజేపీనే విజయాన్ని అందుకుంది. బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా 8 వేల ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. యూపీలో రెండు ఎంపీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూపీ ప్రజలు వారసత్వం, మత రాజకీయాలు, నేరస్తులను ఒప్పుకోరని చెప్పుకొచ్చారు. పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ పార్లమెంటు స్థానంలో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ విజేతగా నిలిచారు.

    spot_img

    Trending Stories

    Related Stories