జూలై 11 న, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) లక్నోలో ఆల్ ఖైదాతో సంబంధిత ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికీ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉందని యుపిలోని ఎడిజి లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ అన్నారు. ఎడిజి కుమార్ మరియు IG ATS విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. భారతదేశంలో ఉగ్రవాద దాడులను అమలు చేయమని ఉమర్ హల్మంది ఆదేశాల ప్రకారం మిన్హాజ్ అహ్మద్, మజీరుద్దీన్ పనిచేస్తున్నారు. వీరి గురించి ఏటీఎస్ కి సమాచారం అందింది.

ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు మానవ బాంబులుగా ట్రైనింగ్ తీసుకున్నట్టు సమాచారం ఉందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెల్లడించింది. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వాట్ ఉల్-హింద్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయని.. మిన్హాజ్ అహ్మద్, మజీరుద్దీన్ ఇద్దరు ఉగ్రవాదులు సహా ఏడుగురు ఇంట్లో ఉన్నట్టు సమాచారంతో ఏటీఎస్ బృందం దాడులు చేసింది. అయిదుగురు ఉగ్రవాదులు పారిపోగా ఇద్దరని పట్టుకున్నట్టు చెప్పారు. ఇద్దరి నుంచి రెండు లైవ్ (ప్రెషర్ కుకర్) బాంబులు, డిటొనేటర్, 6 నుంచి ఏడు కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాష్ట్రంలోని లక్నో సహా పలు నగరాల్లో ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని సీతాపూర్, బారాబంకీ, ఉన్నావ్, రాయ్ బరేలీ తదితర జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. పారిపోయిన మిగతా టెర్రరెస్టుల కోసం రాష్ట్రంలోని పలు నగరాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నట్టు తెలిపారు.

లక్నోతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రను ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. అల్-ఖైదాకు అనుబంధ సంస్థ ‘అన్సర్ ఘజ్వత్-ఉల్-హింద్’ దీనికి ప్లాన్ రచించింది. లక్నో శివారు ప్రాంతాల్లో వేర్వేరుచోట్ల ఉన్న వారి ఇండ్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్రూడ్ బాంబులుగా ఉపయోగించడానికి సిద్ధం చేసిన కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ‘అల్-ఖైదా యూపీ మాడ్యుల్‌కు నేతృత్వం వహిస్తున్న ఉమర్ హల్మంది ఆదేశాల ప్రకారం అహ్మద్, మసీరుద్దీన్ పనిచేస్తున్నారు. అల్-ఖైదా మాడ్యుల్ లక్నోతోపాటు కాన్పూరులోనూ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఉమర్ హల్మంది యువతను ఆకర్షించి అల్-ఖైదాలో చేర్పిస్తూ ఉగ్రదాడులకు పాల్పడేందుకు లక్నోలో నియమించుకున్న కొంతమందితో మాడ్యుల్‌ను ఏర్పాటు చేశాడని ఏడీజీపీ తెలిపారు. యూపీ ఏటీస్ దళాలు రంగంలోకి దిగి లక్నోలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లక్నోలోని కకోరి ప్రాంతంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కురని తెలియడంతో ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బాంబ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి ప్రెజర్ కుక్కర్ బాంబులు, టైమ్ బాంబులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు పట్టుబడిన ఇల్లు షాహిద్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తెలిపారు. అతడి ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతుండడంతో కొన్ని రోజులుగా అతడి ఇంటిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ముఖ్యంగా వసీం అనే వ్యక్తి అతడి ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో మరింతగా నిఘా పెట్టారు. వారంతా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఇవాళ ఇంటిపై దాడి చేసి.. వారిని అరెస్ట్ చేశారు.

విచారణ సమయంలో, అరెస్టు చేసిన నిందితులు తమ సహచరులు తప్పించుకోగలిగారని చెప్పారు. ఏటీఎస్ బృందాలు లక్నో అంతటా వారి కోసం శోధిస్తున్నాయి. ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లలో పోలీసులు బారికేడ్లను వేసి మరీ సెర్చింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఉగ్రవాదులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసే పనిలో ఏటీఎస్ ప్రస్తుతం ఉంది. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత సమాచారం మీడియాతో పంచుకుంటారని.. పోలీసులకు ఏదైనా విలువైనదిగా అనిపిస్తే, వారు మరొక విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారని ఎడిజి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎడిజి మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ ప్రత్యక్ష ప్రసారం అనేక వార్తా ఛానెళ్లలో రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. “జాతీయ భద్రతతో కూడిన కార్యకలాపాల యొక్క ప్రత్యక్ష ఫీడ్‌ను ప్రసారం చేయకుండా ప్రతి ఒక్కరినీ నిరోధించే మార్గదర్శకాలు ఉన్నాయి” అని ఆయన అన్నారు.
