ఇద్దరు రోహింగ్యాలను అరెస్ట్ చేసిన యూపీ ఏటీఎస్.. హిందువులుగా ధ్రువీకరణ పత్రాలతో పెద్ద ప్లాన్

0
1031

ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఇద్దరు రోహింగ్యాలను అరెస్టు చేశారు. నూర్ ఆలం మరియు మహ్మద్ జమీల్‌ అనే ఇద్దరు నకిలీ పత్రాలను రూపొందించి, బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలను భారతదేశం మరియు విదేశాలలోకి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. దీంతో అధికారులు వారిని అరెస్టు చేశారు. ఎంతో మంది రోహింగ్యాలకు హిందువులుగా ధ్రువీకరణ పత్రాలు తయారు చేయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మందిని భారత్ లోని పలు ప్రాంతాల్లో పనుల్లో పెట్టారని కూడా తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. నిందితులు నూర్ ఆలం మరియు మహ్మద్ జమీల్ లు కలిసి రోహింగ్యాలు మరియు బంగ్లాదేశీయులకు హిందూ గుర్తింపులతో నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లను తయారు చేసి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపారు. బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులను అక్రమ రవాణా చేసిన కేసులో గత నెలలో అరెస్టయిన మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం మరియు మహేంది హసన్ అనే మరో నలుగురిని విచారించిన తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికా మరియు కాంగో దేశాలకు పంపారని ATS అధికారి ఒకరు తెలిపారు.

దక్షిణాఫ్రికా మరియు లండన్‌లో విస్తరించిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణా జిల్లాకు చెందిన సమీర్ మండల్ (45), పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన విక్రమ్ సింగ్‌లను ఉత్తరప్రదేశ్ ఎటిఎస్ అరెస్టు చేసింది. గత నెల అక్టోబర్ 26న ఇదే మానవ అక్రమ రవాణా కేసులో మిథున్ మండల్, షాన్ అహ్మద్, మోమినూర్ ఇస్లాం, మహేంది హసన్‌లను మొగల్‌సరాయ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది జులైలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలతో కూడిన మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ ATS అరెస్టు చేసింది. అరెస్టయిన ముగ్గురూ నూర్ ముహమ్మద్, రెహమత్ ఉల్లా మరియు షబీవుల్లా భారతదేశంలో అక్రమంగా బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలను స్థిరపరచడానికి నిధులు పొందుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకుని బ్రతుకుతూ ఉన్నారు.