More

    ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీల కన్నా నోటాకే ఎక్కువట..!

    ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించినప్పటికీ చాలా పార్టీలకు షాకింగ్ కలిగించే విషయం ఒకటి బయట పడింది. అదేమిటంటే కొన్ని పార్టీలకంటే ప్రజలు ‘నోటా’ నే నమ్మారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), జేడీ(యూ) పార్టీల కన్నా ‘నన్‌ ఆఫ్‌ ది ఎబో(నోటా)’ కు ఓట్లే ఎక్కువ పడ్డాయని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లోని గణాంకాల్లో తెలుస్తోంది. పంజాబ్ లో సూపర్ విక్టరీని సాధించిన ఆప్.. ఉత్తరప్రదేశ్ లో మొత్తం పోలైన ఓట్లలో ఆప్‌ కు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడ్డాయి. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్‌సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), ఎన్‌జేపీ(ఆర్‌వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏఐఎఫ్‌బీ, ఐయూఎంఎల్, ఎల్‌జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ 2.38 శాతం ఓట్లు సాధించింది.

    2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన పనితీరును కనబరిచిన బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పట్లో ఆ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జాతీయ వేదికపై దళిత రాజకీయాలకు ఆశాకిరణంగా భావించబడింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పేరు దేశ వ్యాప్తంగా వినిపించింది. ఏదో ఒకరోజు ఆమె ప్రధాని అవుతారనే ప్రచారం కూడా చేశారు. 2012 నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆ పార్టీ 403 మంది సభ్యుల అసెంబ్లీలో గురువారం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది.

    403 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమితం కావడమే కాకుండా, ఆ పార్టీ ఓట్ షేర్ 12.8% దయనీయంగా ఉంది. ఆ పార్టీ మొత్తం 403 స్థానాల్లో పోటీ చేసింది. ముఖ్యంగా, 1993లో, పార్టీ తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పుడు, అప్పట్లో పోటీ చేసిన 164 సీట్లలో 67 గెలుచుకుంది. ఆ సమయంలో ఓట్ల శాతం 11.2% ఉంది.

    Trending Stories

    Related Stories