More

  28 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించిన భారత జట్టు కెప్టెన్

  ఉన్ముక్త్ చంద్.. 2012లో భారత జట్టు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవగానే అతడి పేరు దేశం మొత్తం మారుమ్రోగి పోయింది. అతడి అద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్ తో భారత్ కు వరల్డ్ కప్ ను అందించాడు. భారత్ కు మరో సచిన్ టెండూల్కర్ రాబోతున్నాడని అనుకున్నారు. కానీ అతడు అంచనాలను అసలు అందుకోలేకపోయాడు. దేశవాళీలో అంత గొప్పగా రాణించలేకపోయాడు. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత ప్రాబబుల్స్ జాబితాలో స్థానం లభించినా, తుదిజట్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇండియా-ఏ కెప్టెన్ గా అవకాశం వచ్చినా.. పెర్ఫార్మన్స్ పేలవంగా ఉండడంతో భారత మెయిన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ లో కొనసాగాడు. ఐపీఎల్ లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఉన్ముక్త్ చంద్ కెరీర్ లో ఎదగకపోవడానికి మరెన్నో కారణాలు ఉన్నాయని క్రికెట్ పండితులు అంటూ ఉంటారు.

  ఇప్పుడు ఉన్ముక్త్ చంద్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించాడు. అలాగని అతడి వయసు ఎంతో కాదు.. కేవలం 28 సంవత్సరాలే..! రిటైర్మెంట్ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్ లలో పాల్గొంటానని తెలిపాడు. భారత్ లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించడం వల్ల తాను మాజీ ఆటగాడ్ని అవుతానని, తద్వారా విదేశీ లీగ్ పోటీల్లో ఆడేందుకు అడ్డంకులు ఉండబోవని తెలిపాడు.

  యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ టీ20 పోటీ అయిన ‘మైనర్ లీగ్’ 2021 సీజన్ కోసం ఉన్ముక్త్ చంద్ సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు ఉన్ముక్త్ మకాం మార్చాడు. అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అండర్ -19 ఫైనల్-2012 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అతను 111 నాటౌట్ గా నిలిచాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం మెయిన్ టీమ్ కు ఉన్ముక్త్ చంద్ ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించలేదు. చంద్ 67 ఫస్ట్ క్లాస్ గేమ్‌లు ఆడాడు. 31.57 సగటుతో 3379 పరుగులు చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగ్గా రాణించాడు,120 మ్యాచ్ లలో 41.33 సగటుతో 4505 పరుగులు చేశాడు. టీ20 ల్లో 77 మ్యాచ్ లలో 22.35 సగటుతో 1565 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో పలు జట్లు మారినా గొప్పగా ఆకట్టుకోలేకపోయాడు.

  Trending Stories

  Related Stories