More

    కేంద్ర మంత్రి కౌశ‌ల్ కిషోర్ మేన‌ల్లుడి ఆత్మహత్య

    కేంద్ర మంత్రి కౌశ‌ల్ కిషోర్ మేన‌ల్లుడు యూపీ రాజ‌ధాని ల‌క్నోలోని త‌న నివాసంలో బుధ‌వారం ఉద‌యం విగ‌త‌జీవిగా క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. కౌశల్ కిషోర్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన పార్లమెంటులో మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధ హ‌త్యోదంతంపై కిషోర్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చ‌దువుకున్న బాలిక‌లు, యువ‌తులు స‌హ‌జీవ‌నం చేయ‌రాద‌ని ఆయ‌న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..!

    ఆజ్ తక్‌ నివేదిక ప్రకారం నంద్ కిషోర్ రావత్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మృతుడు ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నారని.. ఆయనకు కుటుంబ కలహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆస్తుల క్రయ, విక్రయాల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఇద్దరు భార్యలతో నందకిషోర్ గొడవపడేవాడు. దీంతో మనస్తాపం చెంది ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు.

    Related Stories