More

    స్కూల్‌ ఫీజు కట్టలేక.. కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

    ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో తండ్రి, ఇద్దరు మైనర్ కుమార్తెలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని షాపూర్ ప్రాంతంలోని గీతా వాటికలోని ఘోసిపూర్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జితేంద్ర శ్రీవాస్తవ (45) తన ఇద్దరు కుమార్తెలు, తండ్రి ఓం ప్రకాష్‌తో కలిసి నివసిస్తూ ఉన్నాడు. జితేంద్ర ఇంట్లో టైలర్‌గా పనిచేసేవాడు. 1999 రైలు ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోయింది. అప్పటి నుంచి అతను కృత్రిమ పాదాల సహాయంతో ఇంట్లో టైలరింగ్ పని చేసేవాడు. అతని భార్య సిమ్మి 2020లో క్యాన్సర్‌తో రెండేళ్ల క్రితం మరణించింది. అతని ఇద్దరు కుమార్తెలు మాన్య శ్రీవాస్తవ (16), మాన్వి శ్రీవాస్తవ ( 14) ఆవాస్ వికాస్‌లోని సెంట్రల్ అకాడమీలో 9, 7 తరగతులు చదువుతున్నారు. ఇద్దరు బాలికలకు సుమారు ఐదు నెలలుగా స్కూల్‌ ఫీజు కూడా చెల్లించడం లేదని పోలీసులకు తెలిసింది. 37 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఫీజు చెల్లించలేకపోవడం.. మరో వైపు పలు కష్టాలు రావడంతో కుమార్తెలతో కలిసి జితేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఈ కేసులో ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. జితేంద్ర తండ్రి ఓం ప్రకాష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 7 గంటలకు నైట్ డ్యూటీ ముగించుకుని తిరిగొచ్చేసరికి ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయని తెలిపారు. వెంటనే కేకలు వేస్తూ బయటకు వచ్చి ఘటన గురించి ఇరుగు పొరుగు వారికి, షాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఎస్పీ డాక్టర్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు.

    Trending Stories

    Related Stories