More

  మహిళలు, వికలాంగులను అక్రమ మత మార్పిడులు.. ఐఎస్ఐ హస్తం

  అక్రమ మత మార్పిడులకు పాల్పడిన ఉమర్ గౌతమ్, ముఫ్తీ ఖాజీ జెహంగీర్ అనే ఇద్దరు వ్యక్తులను ఉత్తర ప్రదేశ్ ఎటిఎస్ అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళలు, శారీరకంగా వికలాంగులైన పిల్లలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు. వీరిద్దరిని ఢిల్లీ లోని జామియా నగర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అరెస్టు అయిన వాళ్లకు పాకిస్తాన్ గూఢచారి ఏజెన్సీ ఐఎస్ఐ నుండి నిధులు సమకూరాయని కూడా తెలిసిందని.. ఈ మత మార్పిడి రాకెట్టును నడుపుతున్న వారిని విచారిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ ఎడిజి (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ చెప్పారు. బధిరులు, మహిళలను టార్గెట్‌ చేసి 1000 మందిని పైగా మతం మార్చారని తెలిపారు. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రోద్భలంతో ఈ ముఠా భారత్‌లో మతమార్పిడలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఉత్తరప్రదేశ్‌ , ఢిల్లీతో పాటు దేశం లోని పలు రాష్ట్రాల్లో ఈ ముఠా తమ రాకెట్‌ను కొనసాగిస్తునట్టు పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి ఈ ముఠాకు భారీగా నిధులు కూడా అందినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

  మతం మారిన ఉమర్ గౌతమ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. తాము ప్రతి సంవత్సరం 250-300 మందిని మతం మార్చామని వెల్లడించారు. మహిళలు, పిల్లలు మరియు వికలాంగులతో సహా సమాజంలో ఆర్థికంగా బలహీనమైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడ్డామని ఉమర్ గౌతమ్ తెలిపాడు. కొందరు స్త్రీలను మత మార్పిడులు చేసి ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేయించామని విచారణలో ఒప్పుకున్నాడని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఉమర్ గౌతమ్ ఇప్పటివరకు 1,000 మందిని మతం మార్చాడు.. పాకిస్తాన్ ISI ఆదేశానుసారం పనిచేస్తున్నారంటూ ప్రశాంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నిందితులు ప్రజలను మార్చడానికి ఇతర మతాలపై నమ్మకం లేకుండా చేయించడం.. రెచ్చగొట్టడమే కాకుండా మోసపూరితమైన మాటలతో మతం మారేలా ప్రేరేపిస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కుమార్. అవిశ్వాసం కలిగించడమే కాకుండా ఇతర మతాలంటే శత్రుత్వం ఉండాలనేలా వీళ్ల బోధనలు ఉన్నాయని వారు చెప్పారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను ఓ క్రమ పద్ధతిలో ఇస్లాం మతంలోకి మార్చాలనే ఏకైక ఉద్దేశ్యంతో జామియా నగర్‌లోని ఇనిస్టిట్యూషన్ ఇస్లామిక్ దావా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కుమార్ తెలిపారు. ఈ రాకెట్‌లో 100 మందికి పైగా ఏజెంట్లు ఉన్నారని గుర్తించారు.

  జహంగీర్‌ , ఉమర్‌గౌతమ్ లు నోయిడాలో బధిరుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. అమాయక మూగ, చెవిటి పిల్లలను మతం మారుస్తూ ఈ ముఠా డబ్బులు ఇతర దేశాల నుండి తెచ్చుకుంటూ ఉంది. గత రెండేళ్ల నుంచి ఈ ముఠా మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు యూపీ పోలీసులు వెల్లడించారు. మహ్మద్‌ ఉమర్‌ గతంలో హిందువని , తరువాత ఇస్లాం స్వీకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. జహంగీర్‌, ఉమర్‌గౌతమ్ ఢిల్లీలోని జామియానగర్‌లో నివాసముంటున్నారు. జామియానగర్‌ లోని ఉమర్‌ కార్యాలయంలో పోలీసులు దాడులు చేసినప్పుడు ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  ఈ పాఠశాలలో సుమారు 1,500 మంది పిల్లలను మార్చినట్లు గౌతమ్ ఒప్పుకున్నాడు. మతం మార్చబడిన పిల్లలను దక్షిణాది రాష్ట్రానికి పంపుతున్నారు. అలాంటి పిల్లల తల్లిదండ్రులను పోలీసులు సంప్రదించారు. ” ఈ కేసు నిజమని తేలింది. పిల్లలను వారు భయపెట్టారని.. ఒక్కొక్కరిగా నిజాలను చెబుతూ వస్తున్నారు. నిందితులు బాధితులను పూర్తిగా మార్చేశారు. ఇస్లాం మంచి మతం అని వారికి చెప్పేవారు. డబ్బు, ఉపాధి ఇంకొన్ని వాగ్దానాలతో వారిని ఆకర్షించారు ”అని ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులను పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు.

  Trending Stories

  Related Stories