బ్రిటర్ పార్లమెంట్ భవనంలో భారత్ కు వ్యతిరేకంగా ఇటీవళ కొందరు ఎంపీలు కూడబలుక్కొని చేసిన కామెంట్స్ గురించి మనకు తెలిసిందే. మన భారత ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ… మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయంటూ కూతలు కూసారు. దీనికి భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. ఎవడిపని వాడు చేసుకుని.. కుతంత్రపు నీతులు, కూతలు ఆపితే మంచిదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా బ్రిటన్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది.
నిజానికి ఈ అంశంపై స్పందించడానికి ప్రపంచ దేశాలేవీ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇదివరకే ఓ ప్రకటన చేసింది. వాటిని తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా దాన్ని అభివర్ణించింది.
తాజాగా బ్రిటన్ కూడా తన వైఖరేమిటో స్పష్టం చేసింది. రైతు ఉద్యమం.. భారత అంతర్గత విషయంగా పేర్కొంది. అందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ అంశంపై బ్రిటన్ పార్లమెంట్‌లో డిబేట్ నడిచింది. భారత సంతతికి చెందిన సభ్యులు దీన్ని లేవనెత్తారు. బ్రిటన్‌లో నివసించే భారత సంతతీయులు రైతు దీక్షలకు మద్దతుగా రూపొందించిన ఆన్‌లైన్ పిటీషన్‌పై సంతకాలను సేకరిస్తున్నారు. ఈ సంతకాల సేకరణ లక్ష మార్క్ కు దాటింది. సుదీర్ఘకాలం పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న రైతులకు సంఘీభావాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందంటూ భారత సంతతికి చెందిన ఎంపీలు పేర్కొన్నారు. మన దేశం పరువుగు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఇటువంటి వారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కేటగిరీ క్రిందకే వస్తారు.
అయితే దీనిపై ఆసియా వ్యవహారాల శాఖ మంత్రి నైగెల్ ఆడమ్స్ స్పందించారు. అది భారత అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. భారత్-బ్రిటన్ మధ్య గల సన్నిహిత సంబంధాలను ప్రభావితం చేయలేవని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, శాంతియుత వాతావరణంలో నిరసనలను తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని అన్నారు. అలాగనీ హద్దులను దాటితే మాత్రం దాన్ని నియంత్రించడానికి భద్రతా బలగాలను వినియోగించాల్సిన అవసరం ఉందనీ చెప్పారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతు ఉద్యమ స్థితిగతులను తాము ఎప్పటికప్పుడు భారత హైకమిష్ కార్యాలయం ద్వారా పర్యవేక్షిస్తోన్నామని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం పలుమార్లు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయం కూడా తమ దృష్టిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ చర్చలు సానుకూల వాతావరణంలో, పరస్పర అంగీకారంతో, అందరికీ మేలు కలిగేలా ముగుస్తాయని తాము ఆశిస్తున్నట్లు నైగెల్ ఆడమ్స్ చెప్పారు.
ఇలా ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్న తీరు ఒకవైపు దేశ వ్యతిరేక విధానాలకు వంతపాడుతున్న సంతతి తీరు మరో వైపు నడుస్తున్న తరుణంలో ఏది నిజం..? ఎవరు ఈ దేశానికి శ్రేయస్కరం..? అన్నది నిశితంగా గమనించాల్సిన విషయం..