More

    బ్రిటన్‎లో కుప్పకూలిన బోరిస్ ప్రభుత్వం..! ప్రధాని రాజీనామా..!!

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలోని 54మంది రాజీనామా చేయడంతో బోరిస్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన గురువారం ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు యూకే మీడియా తెలిపింది.

    ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు, ఇత‌ర కుంభ‌కోణాల‌పై బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వంలోకి ప‌లువురు మంత్రుల్లో తీవ్ర నిర‌స‌న నెల‌కొంది. దాంతో పాటు, లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీకి పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో వారిలో ఆగ్ర‌హం మ‌రింత పెరిగింది. వెంట‌నే, ఈ కుంభ‌కోణాల‌కు నిర‌స‌న‌గా రాజీనామా చేస్తున్నామ‌ని రిషి సున‌క్‌, సాజిద్ జావిద్ త‌మ రాజీనామా లేఖ‌ల్లో తెలిపారు. తాజాగా, జాన్స‌న్ మంత్రివ‌ర్గం నుంచి శిశు, కుటుంబ వ్య‌వ‌హారాల మంత్రి విల్ క్విన్స్, ర‌వాణా శాఖ స‌హాయ మంత్రి లారా ట్రాట్‌ కూడా వైదొల‌గారు. రాజీనామా చేయ‌డం మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్యాయం లేద‌ని త‌న రాజీనామా లేఖ‌లో విల్‌క్విన్స్ వెల్లడించారు. ప్ర‌భుత్వం ప్ర‌జా విశ్వాసం కోల్పోయింద‌ని లారా విమ‌ర్శించారు. ఈ న‌లుగురే కాకుండా, బోరిస్ జాన్స‌న్ టీమ్ నుంచి దాదాపు 10 మంది వ‌ర‌కు స‌హాయ మంత్రులు, ఇత‌ర కీల‌క శాఖ‌ల బాధ్యులు వైద‌ల‌గారు. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట దిగ‌జారింద‌ని వారు ఆరోపించారు.

    లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీకి పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై బోరిస్ జాన్స‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇద్ద‌రు పురుషుల‌ను లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి పార్టీ సంక్షేమం, క్ర‌మ‌శిక్ష‌ణ బాధ్య‌తలు అప్ప‌గించ‌డ‌మేంట‌ని జాన్స‌న్‌పై పార్టీ ముఖ్య నేత‌లు కూడా మండిప‌డ్డారు. దాంతో, ఆ నియామ‌కాన్ని ర‌ద్దు చేసిన జాన్స‌న్‌, బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పిన కాసేప‌టికే రిషి సున‌క్‌, సాజిద్ జావిద్‌లు రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్మం. బోరిస్ నాయ‌క‌త్వ‌లో ప‌రిస్థితిలో మెరుగైన మార్పు వ‌స్తుంద‌ని ఆశించ‌డం లేదని… ఆయనపై ప్ర‌జ‌ల‌తో పాటు తాను కూడా విశ్వాసం కోల్పోయానని.. అందుకే ఈ రాజీనామా చేస్తున్నట్లు త‌న రిజిగ్నేష‌న్ లెట‌ర్‌లో జావిద్ చెప్పారు.

    spot_img

    Trending Stories

    Related Stories