More

    బోరిస్ బుల్డోజర్ ఎక్కినందుకు బ్రిటన్ ఎంపీల విమర్శలు

    యూపీ బుల్డోజర్ల సత్తా దేశాలు దాటి పోయింది. దేశంలోనూ ఇప్పుడు బుల్డోజర్ అనే పదం అందరి నోళ్లలో నానుతుంది. పాత నిర్మాణాలు కూల్చేసే బుల్డోజర్ ప్రస్తుతం కొత్త రాజకీయాలకు వేదికైంది.

    మొదట ఉత్తరప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాలపై బీజేపీ బుల్డోజర్లను ఎక్కుపెట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ బుల్డోజర్ అనే పదాన్ని అస్త్రంగా వాడింది. యూపీలో మొదలైన బుల్డోజర్ సంస్కృతి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ఇదికాస్త మతం రంగు పలుముకుంది. అయితే ఈ బుల్డోజర్ కథకు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సంబంధం ఏమిటని అనుమానం రావటం సహజమే.

    ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుజరాత్‌లో జేసీబీ కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడున్న బుల్డోజర్ పైకి ఎక్కి అభివాదం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణకు బుల్డోజర్ కారణం అవుతున్న క్రమంలో జాన్సన్ ప్రవర్తన చర్చకు దారితీసింది. భారత్‌లో జాన్సన్ తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో బ్రిటన్‌లోనూ బోరిస్ జాన్సన్ బుల్డోజర్ ఎక్కి ఫొటోలు తిగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. భారత సంతతికి చెందిన నాడియా విట్టోమ్‌తో సహా పలువురు లేబర్ పార్టీ ఎంపీలు ప్రశ్నించారు.

    బోరిస్ జాన్సన్ తన భారత పర్యటన క్రమంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా చేపడుతున్న హింసపై మోదీని ప్రశ్నించడంలో విఫలమయ్యారని బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీకి చెందిన జరా సుల్తానా అన్నారు. దానికి బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారని, దీన్నిబట్టి మానవ హక్కుల విషయంలో జాన్సన్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుందంటూ విమర్శించారు. బోరిస్ జాన్సన్ ఇటీవల భారత పర్యటనలో జేసీబీలతో ఫొటోలకు ఫోలిచ్చారని మరో ఎంపీ నాడియా విటోమ్ విమర్శించారు. అయితే మోదీతో ఇళ్ల కూల్చివేతలపై ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదని అన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన దోహపడిందని అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.

    అయితే భారత్ లో బుల్డోజర్లు అక్రమార్కులు, మతోన్మాదులకు చెక్ పెడుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడుతున్నాయి. నేరస్తులను ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి. యూపీ మొదలైన ఈ విప్లవం.. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మతకల్లోలాలు, ఘర్షణలకు పాల్పడుతున్న ఓ వర్గం వాళ్లకు తగిన బుద్ధి చెబుతున్నాయి. అలాంటి బుల్డోజర్ బోరిస్ ఎక్కితే తప్పేంటని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. భారత్ లో జరిగే హింసపై ఎన్నడూ నోరు మెదపని బ్రిటన్ ఎంపీలు.. ఇప్పుడు బుల్డోజర్ ను తప్పుపట్టడం విచిత్రంగా ఉందని అంటున్నారు. హిందువులపై దాడులను ఎనాడు ఖండించిన వారు.. ఓ వర్గం అరాచకాలను అడ్డుకుంటున్న బుల్డోజర్ ను బోరిస్ ఎక్కితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

    Trending Stories

    Related Stories