More

    ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత మోదీ..! యూకే పార్లమెంట్ ప్రశంసలు..!!

    ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై ఇటు భారత్‎లోనూ, అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా డాక్యుమెంటరీని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు రిషి సునాక్ కు మరికొందరు బ్రిటిష్ ఎంపీలు తోడయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా.. పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని మోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు. తాజాగా యూకే చట్టసభ సభ్యుడు Karan bilmoria మోదీని ప్రపంచనేతగా కొనియాడారు. ఈ భూమి మీద అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ.. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు,.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమే’ అని కొనియాడారు. రాబోయే దశాబ్దాలలో యూకేకు భారత్ అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా భారత్ ఉంటుందని,.. ఇరు దేశాలు అభివృద్దిలో చక్కటి భాగస్వామ్యంతో ముందుకు కొనసాగుతాయని యూకే పార్లమెంట్ లో అన్నారు.

    ప్రధాని మోదీ చిన్నప్పుడు టీ అమ్మేవారనీ,.. అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేత మోదీ ఒక్కరే అని తెలిపారు.ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాలకు వేదికగా నిలిచిందన్నారు. రాబోయే 25 ఏళ్లలో 32 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తోందని ఇది ఎంతో అభినందనీయమని bilmoria తెలిపారు. భారత్ ఇప్పుడు యూకేని.. అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్న ఆయన.. 140 కోట్ల జనాభా కలిగి, అతివేగంగా అభివృద్ధి చెందుతుంన్న దేశంగా భారత్ నిలుస్తోందని బ్రిటన్ పార్లమెంట్ లో వెల్లడించారు.

    అంతేకాదు, 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పుడు భారత్ యువదేశంగా ఉందని కొనియాడారు. యువ శక్తికి భారత్ కేంద్రంగా ఉందని ప్రపంచానికి మేధోసంపత్తి ఎగుమతి చేసే విషయంలో భారత్ ముందువరుసలో ఉంటుందన్నారు Karan bilmoria. గత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం వృద్ధి రేటును కలిగి ఉండి.. పునరుత్పాదక శక్తి, సౌరశక్తితో నాలుగో అతిపెద్ద దేశంగా ఉందన్నారు. దీంతో పాటు కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్, బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్లను తయారు చేసిందని అన్నారు bilmoria. భారత్ తో యూకే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బాగా అభివృద్ధి చెందిందని.. భారతదేశం యూకే 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తెలిపారు. ప్రధాని మోదీ వల్లే భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్తాయికి చేరుకుందని వెల్లడించారు. ఆయన శక్తిమంతమైన నాయకుడనీ,.. ప్రపంచాన్ని నడిపే శక్తి మోదీకి ఉందని తెలిపారు.

    బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన నేపథ్యంలో మోదీకి మద్దతుగా విదేశీ నాయకులు సైతం గళమెత్తారు. డాక్యుమెంటరీని పూర్తి అవాస్తవ కథనాలతో రూపొందించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీన్ని భారత్ కూడా వ్యతిరేకించడంతో,.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఈ విషయాన్ని గమనించిన బ్రిటన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆ దేశ పార్లమెంటులో భారత్ ను ప్రధాని మోదీని పలువురు ఎంపీలు కొనియాడుతున్నారు. ఇందులో భాగంగానే బ్రిటన్ పార్లమెంటులో Karan bilmoria మోదీని ప్రపంచ శక్తివంతమైన నేతగా కొనియాడారు.

    Trending Stories

    Related Stories