More

  ఇది ఆలయమా.. టీఆర్‌ఎస్ ఆఫీసా.. ఉజ్జయినీ మహంకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత

  తెలంగాణలో బోనాల పండుగ సందడి నెలకొంది. సికింద్రాబాద్‌లోకి ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల పండుగ జరుగుతోంది. మహిళలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులతో పాటు మంత్రి తలసాని దంపతులు, ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ క్రమంలో లష్కర్ బోనాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి దర్శనానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లగా.. ఉజ్జయిని ఆలయం దగ్గర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇది ఆలయమా? టీఆర్‌ఎస్ ఆఫీసా? అంటూ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల మండిపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, అంజన్ కుమార్ యాదవ్‌లు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు విరుద్దమైన నిర్ణయాలను తీసుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

  spot_img

  Trending Stories

  Related Stories