National

వర్చువల్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్ థాక్రే

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. పార్టీ నేతలతో శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. తిరుగుబాటు చేసి ఏక్ నాథ్ షిండే వెనుక చేరిన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా పార్టీని విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని.. పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామని ప్రమాణాలు చేసినవారే ఇప్పుడు పారిపోయి పార్టీని దెబ్బతీస్తున్నారన్నారు. శివసేన, థాక్రేల పేర్లు వాడకుండా వారెంత దూరం వెళ్లగలరని ప్రశ్నించారు. తాను వర్ష బంగ్లా ( సీఎం నివాసం) నుంచి మాత్రమే వెళ్లిపోయానని.. పోరాటం వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. మరిన్ని నిర్ణయాలతో పోరాడుతానని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండేకు నగరాభివృద్ధి వంటి కీలక శాఖ ఇచ్చామని.. గతంలో ఇది సీఎం వద్దే ఉండేదని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే కుమారుడికి కూడా పార్లమెంట్ అవకాశం ఇచ్చామని, షిండేకు అన్ని రకాల గుర్తింపు ఇచ్చినా.. ఆయన మమ్మల్ని మోసం చేశారని ఉద్ధవ్ థాక్రే అన్నారు.

ఛత్రపతి శివాజీ కాలంలో ప్రత్యర్థులు గ్రామాల తర్వాత గ్రామాలను యుద్ధంలో నాశనం చేసే వారని.. అయితే శివాజీ తనతో కలిసి ఉన్న నిజాయితీపరులతో కలిసి ఆ గ్రామాలను పునర్నిర్మించారని.. పార్టీ పునర్నిర్మాణానికి అందరం కృషి చేయాలని ఉద్ధవ్ అన్నారు. నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మీరు కోరుకుంటే, నేను దానిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఏక్ నాథ్ షిండే కుమారుడు ఎంపీగా ఉన్నారు. అలాంటప్పుడు నా కుమారుడి విషయంలో వారికి ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదన్నారు. నేను ఇక కోలుకోలేనని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button