More

    యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా అకాల మరణం

    యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇక లేరు. 73 ఏళ్ల షేక్‌ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

    షేక్‌ ఖలీఫా 2014, నవంబర్‌ 3 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

    సుల్తాన్‌ 1971 నుంచి నవంబర్ 2, 2004 వరకు మరణించే వరకు యూఏఈ మొదటి అధ్యక్షుడిగా సేవలందించారు. 1948లో పుట్టిన షేక్‌ ఖలీపా.. యూఏఈకి రెండో అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం .. అబుదాబి యొక్క క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో డి- ఫాక్టర్ పాలకుడిగా కనిపించడంతో రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనడాన్ని అల్ నహ్యాన్ మానేశారు. ప్రస్తుతం దేశ అధ్యక్షుడి అకాల మరణంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ దేశం జండాను సగం వరకు అవనతం చేస్తు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

    ఆయన పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు యూఏఈ ప్రభుత్వం తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు. నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి సూచనలు చేశారు. ఫెడరల్‌ నేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల కోసం నామినేషన్‌ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ చూపారు.

    Trending Stories

    Related Stories