More

    భారత్ పాక్ ల మధ్య రహస్య ఒప్పందంపై ‘బ్లూమ్ బర్గ్’ సంచలన కథనం

    విదేశీ పత్రికల కథనాలను మనం యథాతధంగా తీసుకొనవలసిన పనిలేదు. జస్ట్ పరిగణలోకి తీసుకుంటే చాలు. ఎందుకంటే భారత్ కు ఎప్పుడు ఏం చేయాలి.. ఎలా చేయాలి అన్న క్లారిటీ ఉంది. దానికి తోడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దేశాభివృద్ధికి.. ప్రపంచ మైత్రికి తొలి నుంచి ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్, చైనా, టర్కీ, బంగ్లాదేశ్చ, మయన్మార్ వంటి దేశాల విషయంలో మాత్రం ఫస్ట్ సస్పెక్ట్ దెన్ ఓన్లీ రెస్పెక్ట్ ధోరణిని వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తూ వస్తున్నాం. ఈ తరుణంలో బ్లూమ్ బర్గ్ కథనం నిజమా,, కాదా.. ఒకవేళ నిజమైతే ఎటువంటి పరిస్థితులకు దారి తీయనుంది అనేది వేచి చూడాలి. దాని కంటే ముందు భారత విదేశాంగ శాఖ, భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని లేదా ప్రకటనల్ని మాత్రమే మనం విశ్వసించాలి అనే విషయాన్ని మరచిపోరాదు.

    పాకిస్తాన్.. భారత్ రెండూ అణ్వాయుధ దేశాలే.. ఇరు దేశాల మధ్య అలజడులు యుద్ధానికి దారి తీస్తే నష్ట తీవ్రర రెండు వైపులా ఒకేలా ఉంటుంది. అంతే కాదు అతి ప్రపంచ శాంతికి తీవ్రభంగం వాటిల్లజేస్తుంది. మరో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసినా ఆశ్యర్యం లేదు.. కారణం ఈ ప్రపంచం ఎప్పుడో అనేక రకాల లింకులతో కలగలికి ఒక కుగ్రామంగా మారిపోయింది. సో.. ఇక్కడ ప్రాక్టికల్ గా మాట్లాడాలి అంటే రెండు దేశాలు కొట్టుకునే కంటే.. విధించుకునన కట్టుబాట్లను అనుసరిస్తే సమస్త ప్రజానీకానికి అది ఆరోగ్యకరం. కానీ దొంగ ఎత్తులు వేసే నక్కజిత్తుల చైనా మాటున భారత్ కు చేయకూడని ద్రోహం చేస్తూ వచ్చింది పాక్. దీనిని క్షమించని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి.. ప్రేరేపిత ఉగ్రమూకలకు బోర్డర్ దాటేలోపే పార్శిల్ చేసి పంపేస్తోంది. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు అనేది నిజం. కారణం పాక్ లో తిష్టవేసుకుని కూర్చున్న ఉగ్రసంస్థలు. పాక్ లో ఎవరు అధ్యక్షుడు అయినా పెత్తనం అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీదేననే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత బ్లూమ్ బర్గ్ ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

    భారత్, పాకిస్తాన్ ల మధ్య రహస్య శాంతి ప్రణాళిక అమలవుతున్నదని, దీనికి యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం వహిస్తున్నదని ఆ బ్లూమ్ బర్గ్ కథనంలో హైలైట్ లైన్. దీంతో భారత్, పాకిస్తాన్‌ మళ్లీ దోస్తానాకు సిద్ధమయ్యాయా? పలు రంగాల్లో పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్దరించుకోనున్నాయా? చైనా చేతిలో పావుగా మారిన దాయాదితో మళ్లీ మంతనాలకు భారత్ సిద్ధమైందా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ బారిన పడటంతో అతడు త్వరగా కోలుకోవాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం, సరిహద్దులో కాల్పుల విరమణపై ఇరు సైన్యాలు ఉమ్మడి ప్రకటన చేయడం ఈ శాంతి ప్రణాళికలో భాగమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు చూడబోతున్నామని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రెండేళ్లుగా దాదాపు యుద్దభాషలోనే మాట్లాడుకున్న భారత్, పాకిస్తాన్ సైన్యాలు.. గత నెలలో ‘సరిహద్దు వద్ద కాల్పులకు చరమగీతం పాడుతున్నాం’అంటూ ఉమ్మడి ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయేద్ ఫిబ్రవరి 26న ఢిల్లీకి విచ్చేసి, మన విదేశాంగ మంత్రి జైశకంర్ తో భేటీ అయ్యారు. ముందస్తు అజెండా లేకుండా సాగిన ఆ భేటీకి సంబంధించి.. రెండు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాలను చర్చించారని తెలిపినప్పటికీ వ్యూహాత్మక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

    పుల్వామా దాడి అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం, ఇస్లామాబాద్ లోని భారత్ రాయబారకార్యాలయం మూతపడ్డాయి. ఆర్మీ హాట్ లైన్లు తప్ప ఇరువురి మద్య ఎక్కడా చర్చలు జరగలేదు. అదే సమయంలో పలు అంతర్జాతీయ వేదికలపై పాక్ దురాగతాన్ని, ఉగ్ర కార్ఖానాగా అది వ్యవహరిస్తోన్న తీరును భారత్ ఎడగడుతూ వచ్చింది. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేతపై పాక్ లొల్లి చేయాలనుకున్నా, యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాలు అందుకు నో చెప్పడం, భారత్ అంత్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని హితవు పలకడం జరిగింది. ఇటీవల కాలంలో పాక్ చైనాకు దగ్గరవ్వగా, పాక్ తో కంటే భారత్ తోనే అన్ని విధాలా లాభం పొందుతోన్న యూఏఈ మధ్యవర్తిత్వానికి సైతం పూనుకుందని, ఆ ఫలితంగానే కాల్పుల విరమణపై ఉమ్మడి ప్రకటన వెలువడిందని, శాంతి ప్రణాళికలో తర్వాతి ఘట్టంగా ఎంబసీల రీఓపెనింగ్ ఉంటుందని బ్లూమ్స్ బర్గ్ పేర్కొంది.

    ట్రంప్ ఏలుబడిలో అమెరికా పెద్దన్న పాత్ర బలహీనపడటం, ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ప్రయోజనాల రీత్యా ఆ మేరకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న క్రమంలో జోబైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మళ్లీ అన్ని దేశాలతో సంబంధాలను రివ్యూ చేసుకుంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ ఈ మేరకు వరుసగా విదేశీ పర్యటనలు చేపట్టారు. అస్టిన్ రెండ్రోజుల కిందటే భారత్ కూడా వచ్చివెళ్లారు. కాగా, అఫ్టానిస్తాన్ విషయంలో విస్తృత స్థాయి పరిష్కారాలు చూపాలనుకుంటోన్న జోబైడెన్.. ఆ ప్రక్రియలో పాకిస్తాన్, భారత్ లను కూడా కలుపుకొని పోవాలనుకుంటున్నారని, అది జరగాలంటే ముందు భారత్, పాక్ ల మధ్య కనీసం మాట, మంతి కొనసాగాల్సి ఉంటుందని, యూఏఈ మద్యవర్తిత్వంలో ‘అమెరికా కోణం’ కూడా ఉందని కథనంలో పేర్కొన్నారు.

    అయితే ఈ రహస్య శాంతి ప్రణాళిక కేవలం అమెరికా లభ్ధి అనే కోణంలో మాత్రమే చూడక్కర్లేదని.. భారత్ పాక్ దేశాలూ లబ్దిపొందే వీలుందని కథనంలో తెలిపారు. చైనాను కట్టడి చేసే దిశగా బైడెన్ బృందం ఇండో పసిఫిక్ రీజియన్ లో కీలక కార్యకలాపాలు నెరపుతుండటం, చైనాను నిలువరించాలని ప్రధని మోదీ కూడా భావిస్తున్నందున అందుకు ఉపకరించే ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

    అయితే విదేశీ పత్రికల కథనాలను మనం యథాతధంగా తీసుకొనవలసిన పనిలేదు. జస్ట్ పరిగణలోకి తీసుకుంటే చాలు. ఎందుకంటే భారత్ కు ఎప్పుడు ఏం చేయాలి.. ఎలా చేయాలి అన్న క్లారిటీ ఉంది. దానికి తోడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దేశాభివృద్ధికి.. ప్రపంచ మైత్రికి తొలి నుంచి ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్, చైనా, టర్కీ, బంగ్లాదేశ్చ, మయన్మార్ వంటి దేశాల విషయంలో మాత్రం ఫస్ట్ సస్పెక్ట్ దెన్ ఓన్లీ రెస్పెక్ట్ ధోరణిని వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తూ వస్తున్నాం. ఈ తరుణంలో బ్లూమ్ బర్గ్ కథనం నిజమా,, కాదా.. ఒకవేళ నిజమైతే ఎటువంటి పరిస్థితులకు దారి తీయనుంది అనేది వేచి చూడాలి. దాని కంటే ముందు భారత విదేశాంగ శాఖ, భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని లేదా ప్రకటనల్ని మాత్రమే మనం విశ్వసించాలి అనే విషయాన్ని మరచిపోరాదు.

    Trending Stories

    Related Stories