More

    చిత్తూరు జిల్లాలో జల్లికట్టు.. ఇద్దరు యువకులు మృతి

    చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటుచేసుకుంది. గుడిపాల మండలం సిబండపల్లిలో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో.. ఒకరు స్థానిక ముటుకూరుకు చెందిన వెంకటేష్ కాగా, మరో యువకుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

    spot_img

    Trending Stories

    Related Stories