ఇండిగో ఫ్లైట్ లో దుబాయ్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మద్యం మత్తులో హంగామా చేశారు. దీంతోఅధికారులు వారిని అరెస్టు చేశారు. విమానంలో మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు విమాన సిబ్బందిని, తోటి ప్రయాణికులను బూతులు తిట్టారు. ఈ ఘటనపై ముంబైలోని సహర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
మార్చి 22వ తేదీ బుధవారం ఇండిగో విమానంలో తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తులు తోటి ప్రయాణికులను బూతులు తిట్టారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన కో పైలెట్, ఎయిర్ హోస్టస్ పై దాడికి ప్రయత్నించారు. గొడవ చేసిన ప్రయాణికులు ఇద్దరినీ ముంబైలో ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ ఇద్దరు ప్రయాణికులను కోర్టులో హాజరుపరిచామని వారికి బెయిల్ కూడా వచ్చినట్లు ముంబై ఎయిర్ పోర్ట్ పోలీస్ అధికారులు తెలిపారు. వారిద్దరూ మహారాష్ట్రలోని పాల్ఘర్, కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన వారు. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది తర్వాత భారత్ కు తిరిగి వస్తుండగా.. డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి తెచ్చుకున్న మద్యం తాగి విమానంలోనే సంబరాలు చేసుకున్నారు. చిక్కుల్లో పడ్డారు.