జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. చక్‌తారస్ కంది ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో ఆ ప్రాంతంలో బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన తుఫెయిల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఏరియాలో ఉగ్రవాదుల కోసం బలగాల వేట కొనసాగుతోంది. సోమవారం నాడు బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టింది.