National

అమర్ నాథ్ యాత్రలో.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి

అమర్ నాథ్ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. రాజమండ్రికి చెందిన సుధ, మరో మహిళ పార్వతి మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమర్ నాథ్ యాత్రకు ఏపీ నుంచి 84 మంది యాత్రికులు వెళ్లారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలన వారంతా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీనగర్ మార్చురీలో సుధ మృతదేహం, ఢిల్లీ ఎయిమ్స్ లో సుధ మృతదేహాన్ని ఉంచారు. ఏపీ నుంచి వెళ్లిన ఇద్దరు యాత్రికుల మృతదేహాలను ఏపీకి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వారిని కూడా సురక్షితంగా ఏపీలోని వారి ప్రాంతాలకు పంపించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్షాల కారణంగా నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా బ్రేక్ పడిన అమర్ నాథ్ యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమైంది. బాల్తాల్ మార్గంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రెండు మార్గాల్లో హెలికాప్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు.

జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. జభారీ వర్షం, కొండల పైనుంచి వరద రావడంతో పలువురు యాత్రికులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Related Articles

Back to top button