More

    పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

    పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో గత రాత్రి భద్రతా దళాల చేతిలో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. అల్ బదర్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను ఎజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. వారి దగ్గర రెండు ఏకే-47 రైఫిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య పుల్వామాలో వలస కూలీలపై దాడులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ కారణంగా పుల్వామాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మిత్రిగాం గ్రామంలో పండ్లతోట పక్కన మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారం అందడంతో సైన్యం, పోలీసుల బృందాలు బుధవారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతూ ఉండగా తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానికులను అక్కడి నుండి తరలించడానికి కొద్ది సమయం పాటు ఆపరేషన్ నిలిపివేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

    Trending Stories

    Related Stories