More

    ఎల్‌ఇటి, టిఆర్‌ఎఫ్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

    జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి. శ్రీనగర్‌లోని జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని కశ్మీర్‌ ఐజీపీ వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. అందులో ఒకరిని ఇఖాలక్‌ హాజమ్‌గా గుర్తించామని, అతడు అనంత్‌నాగ్‌లోని హస్సన్‌పొరాలో హెచ్‌సీ అలీ మొహద్‌ను కాల్చిచంపిన నిందుల్లో ఒకడని తెలిపారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

    కశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పోరా అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెచ్‌సి అలీ మహ్మద్ హత్యలో పాల్గొన్న ఇఖ్లాక్ హజామ్ తాజా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని తెలిపారు. ఉగ్రవాదుల వద్ద 2 పిస్టల్స్ సహా పలు పరికరాలు లభించాయి. “Terrorists of terror outfit LeT/TRF neutralised by Srinagar Police. One of the killed terrorists Ikhlaq Hajam was involved in the recent killing of HC Ali Mohd at Hassanpora Anantnag. Incriminating materials including 02 pistols recovered: IGP Kashmir,” అంటూ కశ్మీర్ జోన్ పోలీసు విభాగం ట్వీట్ చేసింది. శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఎన్ కౌంటర్ మొదలైందని అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories