More

    ఇద్దరు తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్న భారత సైన్యం

    కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. షోపియాన్ జిల్లా దుంబవన్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు తలదాచుకున్న విషయాన్ని తెలుసుకుని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత భారత సైన్యం వారిని అదుపులోకి తీసుకుంది. రాంబీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా సైనికులు వారిని అరెస్టు చేశారు. వారిని షాహిద్‌ అహ్మద్‌, అతని అనుచరుడు కిఫాయత్‌ అయూబ్‌ అలీగా గుర్తించారు. వారినుంచి చైనీస్‌ పిస్తోల్‌ సహా ఆయుధ సామాగ్రి, పిస్తోల్‌ మ్యాగజైన్‌, రెండు చైనీస్‌ హాండ్‌ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

    ఉగ్రవాదుల వద్ద రెండు చైనా తయారీ గ్రెనేడ్లు దొరికాయి. డుంబవన్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఆర్మీ తెలిపింది. అనంతరం ఉగ్రవాదులను పోలీసులు, ఆర్మీ బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు పారిపోయేందుకు ప్రయత్నించినా వీలు పడలేదు. షాహిద్ అహ్ గనై, అయూబ్ అలీలను పట్టుకున్న ఉగ్రవాదులుగా గుర్తించారు. షాహిద్ డుంబవన్ నివాసి. షాహిద్ అక్టోబరు 8న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. అయూబ్ అలీ బుద్గామ్ ప్రాంతంలోని పింజోరా నివాసి. కార్మికుడిగా పని చేస్తూ ఉగ్రవాదులకు సహాయం చేసే వాడని తెలుస్తోంది.

    శనివారం బుద్గాం జిల్లాలోని పుష్కర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఉగ్రవాదిని హమీద్ నాథ్ గా గుర్తించారు. లష్కర్ కమాండర్ మహ్మద్ యూసుఫ్ కాంత్రో హమీద్‌కు సన్నిహితుడు. అతడి వద్ద తుపాకీ, మ్యాగజైన్ 05 రౌండ్లు, ఒక చైనీస్ గ్రెనేడ్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

    Trending Stories

    Related Stories