కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. బారాముల్లా జిల్లాలోని యెడిపోరా, పట్టణ ప్రాంతంలో ఇవాళ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. షోపియాన్‌లోని చిత్రగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, పోలీసులు.. భద్రతా దళాలు పనిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదుల గురించి అందిన పక్కాగా అందించిన సమాచారం మేరకు.. పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు పేర్కొన్నారు. రెండు ఎన్‌కౌంటర్‌లు శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతూ ఉందని అధికారులు తెలిపారు. హతమైన మిలిటెంట్ల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.