బెంగాల్‎లో బీజేపీ ఆఫీసుకు నిప్పు..! ఆందోళనలో ఇద్దరు మృతి..!!

0
726

మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన కామెంట్ల దుమారం కంటిన్యూ అవుతుంది. నుపూర్ సారీ చెప్పిన అతివాద సంస్థలు వినడం లేదు. బీజేపీ, హిందూ సంస్థల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఒకడుగు ముందుకేసి బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

హౌరా రూరల్‌లో గల బీజేపీ కార్యాలయానికి కొందరు నిప్పుపెట్టారు. దానిని ఓ బీజేపీ నేత ట్వీట్ చేశారు. నిప్పు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనకారులు, రాళ్లు రువ్విన వారిపై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందని అనిర్బాన్ గంగూలీ ప్రశ్నించారు.

తమ పార్టీ ఆఫీసు విధ్వంసం కావడానికి టీఎంసీ కారణం అని బీజేపీ నేత సువేంద్ అధికారి ఆరోపించారు. అల్లరిమూకలకు దీదీ సర్కార్ అండగా నిలుస్తోందని చెప్పారు. అందుకే వారు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. హౌరాలో చెలరేగిన హింసాత్మక ఘటనలను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను మూసివేశారు. చెంగల్ స్టేషన్ వద్ద ఆందోళనకారులు నిరసనకు దిగారు. దీంతో ఆగ్నేయ రైల్వే మార్గంలో రైళ్లను నిలిపివేశారు.

మరోవైపు రాజధాని రాంచీలోని ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. సస్పెండైన బిజెపి నేతలు నుపూర్‌ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నవీన్‌ జిందాల్‌, నుపూర్‌ శర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో ప్రదర్శనలు క్ర‌మంగా హింసాత్మకంగా మారింది. నిరస‌న‌కారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించగా.. నిర‌స‌న‌కారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. పలువురు పోలీసులు గాయపడ్డారు. వారిని నిలువ‌రించేందుకు పోలీసులు ఏరియల్ ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో నిర‌స‌న‌కారులు అదుపులోకి వ‌చ్చారు. అయితే.. ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులకు బులెట్లు తాకి మరణించారు.

బుల్లెట్ గాయాలతో మరణించిన వారిలో ఒకరిని మహ్మద్ షాహిద్ గా గుర్తించారు. అదే సమయంలో.. ఈ హింసలో గాయపడిన రాంచీ SP కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన స్థానంలో డీఎస్పీ అన్షుమన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడగా… ఆసుపత్రికి తరలించిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అధికారులు ధ్రువీకరించారు. 10 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం తలెత్తిన ఉద్రిక్తతలతో రాంచీలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

మహ్మద్ ప్రవక్త గురించి నూపూర్ శర్మ చేసిన ప్రకటన తర్వాత, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశంలోని పలు నగరాల్లో నిర‌స‌న ప్రదర్శనలు జరగాయి. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెలరేగాయి. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. యూపీలో చాలా చోట్ల ఇలాంటి హింసాత్మక ప్రదర్శనలు కనిపించాయి. ఇందులో ఇప్పటి వరకు 136 మందిని అరెస్టు చేయగా.. మిగిలిన వారిని గుర్తిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here