More

    సిక్కులే లక్ష్యంగా ఆఫ్గాన్‎లో ఐసిస్ దాడులు..!

    ఆఫ్ఘనిస్తాన్‎లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది.

    ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారి సంఖ్యపైనా ప్రస్తుతం స్పష్టత లేదు. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం వెలుపల పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విధంగా గురుద్వారా కాంప్లెక్స్ లో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గురుద్వారాకు అనుబంధంగా ఉన్న కొన్ని దుకాణాలు ధ్వంసం అయ్యాయి.

    శనివారం ఉదయం గురుద్వారాలో ప్రార్థనలు చేయడానికి 25-30 మంది ఆఫ్ఘన్ హిందువుల, సిక్కులు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఇదే సమయంలో భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి 10-15 మంది తప్పించుకోగా.. మిగతా వారంతా లోప‌ల చిక్కుకుని ఉంటార‌ని లేదా మ‌ర‌ణించి ఉంటార‌ని భావిస్తున్నారు. సెక్యూర్టీ గార్డ్ అహ్మ‌ద్‌ను కాల్చి చంపారు. గురు గ్రంథ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలోని ప్రధాన దర్బార్ హాలు మంటల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆఫ్ఘన్ లో సిక్కులు, హిందువులు టార్గెట్ గా చేసిన దాడిలో చాలా మంది మరణించారు మార్చి 25, 2020లో కాబుల్ లోని గురుద్వారా గురు హర్ రాయ్ సాహిబ్ వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది సిక్కులు మరణించారు. 2018లో జలాలాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో సిక్కు మాజీ ఎంపీ నరీందర్ సింగ్ ఖల్సా తండ్రి అవతార్ సింగ్ ఖల్సాతో సహా 19 మంది సిక్కులు, హిందువులు మరణించారు. తాజా దాడిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని భారత విదేశాంత మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.

    మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే, భారతీయ సిక్కు నేత మన్​జిందర్​ సిర్సా కూడా ట్వీట్​ చేశారు. బుల్లెట్​ గాయాలతో చనిపోయిన ఓ వ్యక్తి ముస్లిం అని చెప్పారు. లోపల ఇంకా కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. సంబంధిత వీడియోలను కూడా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఓ ఉగ్ర ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. అఫ్గాన్​లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇక ఈ దాడికి ఐసిస్ కురాసన్ కారణం కావచ్చని తాలిబన్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. అదే తరహా దాడులు చేపడతామని ఐసిస్​.. ఇటీవలే ఓ వీడియోను విడుదల చేసింది. చివరికి ఐసిస్​ ఉగ్రవాదులు అనుకున్నది చేశారు. గతేడాది ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరసగా మైనారిటీలు లక్ష్యంగా ఐసిస్ దాడులకు తెగబడుతోంది. షియా, హజారా వర్గాలపై దాడులు చేస్తోంది. తాజాగా హిందూ, సిక్కులపై దాడి చేసింది.

    spot_img

    Trending Stories

    Related Stories